Daughter: ప్రియుడి కోసం తల్లిని చంపింది, ఆంటీ కోసం ప్రియుడి నిమ్మకాయ స్కెచ్, వీడియో కాల్ లో !
ఫరీదాబాద్/చెన్నై: తల్లితో కలిసి చక్కగా ఉంటున్న కూతురి జీవితంలో ఓ యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. 16 ఏళ్ల వయసుకు వచ్చిన కూతురిని ఆమె తల్లి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. యువతి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన యువకుడు సినిమా హీరో లెవల్లో రెచ్చిపోయి అమ్మాయిని లొంగదీసుకున్నాడు. ప్రియుడి బైక్ లో తిరుగుతున్న యువతి కూడా హీరోయిన్ లెవల్లో రెచ్చిపోయింది. యువతి, యువకుడు ఎక్కడపడితే అక్కడికి తిరుగుతూ ఎంజాయ్ చేశారు. తన కూతురు ఓ యువకుడితో తిరిగుతోందని, తాను ఇంట్లో లేని సమయంలో అతను ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్న ఆమె తల్లి అభ్యంతరం వ్యక్తం చేసింది. చెప్పినమాట వినని కూతురిని పట్టుకుని చితకబాదేసింది. ప్రియుడు తప్పా వేరే ప్రపంచం తనకు అక్కరలేదని డిసైడ్ అయిన కూతురు తల్లిని చంపేయాలని డిసైడ్ అయ్యింది. ప్రియుడు వీడియో కాల్ లో తల్లిని ఎలా చంపాలి అంటూ ప్రియురాలికి సూచనలు, సలహాలు ఇవ్వడంతో అదే ప్లాన్ ప్రకారం తల్లిని హత్య చేసిన కూతురు ఇప్పుడు కటకటాలపాలైయ్యింది.

కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లి
హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో స్వాతి సింగ్ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. స్వాతి సింగ్ కు 16 ఏళ్ల కూతురు ఉంది. 16 ఏళ్లకు యవ్వనం వయసుకు వచ్చిన కూతురిని ఆమె తల్లి స్వాతి సింగ్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. మంచి అబ్బాయితో కూతురి పెళ్లి చెయ్యాలని స్వాతి సింగ్ అనేక కళలు కనింది.

హీరో లెవల్లో ఫోజులు కొట్టిన కిలాడి
తల్లి స్వాతి సింగ్ తో కలిసి చక్కగా ఉంటున్న కూతురి జీవితంలో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజా సింగ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. యువతి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన రాజాసింగ్ (18) సినిమా హీరో లెవల్లో రెచ్చిపోయి అమ్మాయిని లొంగదీసుకోవడానికి అనేక ప్రయత్నాలు, తిక్కతిక్క చేష్టలు చేశాడు.

ఎంజాయ్ చేసిన లవర్స్
కొంత కాలానికి యువతి కూడా రాజా సింగ్ బిల్డప్ చూసి అతని వలలో పడిపోయింది. ప్రియుడు రాజా సింగ్ బైక్ లో తిరుగుతున్న ఆ యువతి కూడా హీరోయిన్ లెవల్లో రెచ్చిపోయింది. యువతి, ఆమె ప్రియుడు రాజా సింగ్ కలిసి ఎక్కడపడితే అక్కడకు తిరుగుతూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేసి ఇంతకాలం గడిపేశారు.

కూతురిని చితకబాదిన తల్లి
తన కూతురు రాజా సింగ్ అనే యువకుడితో తిరిగుతోందని, తాను ఇంట్లో లేని సమయంలో అతను ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్న ఆమె తల్లి స్వాతి సింగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కూతురు చెప్పిన మాట వినకపోవడంతో స్వాతి సింగ్ ఆమె కూతురిని పట్టుకుని చితకబాదేసింది. కూతురు బయటకు వెళ్లకుండా స్వాతి సింగ్ కట్టడి చేసింది.

వీడియో కాల్ లో హత్యకు ప్లాన్ చెప్పిన ప్రియుడు
ప్రియుడు రాజా సింగ్ తప్పా వేరే ప్రపంచం తనకు అక్కరలేదని డిసైడ్ అయిన కూతురు తల్లి స్వాతి సింగ్ ను చంపేయాలని డిసైడ్ అయ్యింది. తన తల్లిని చంపేసి మనం ఎక్కడికైనా పారిపోదామని ఆ యువతి ఆమె ప్రియుడు రాజా సింగ్ కు చెప్పింది. ప్రియుడు రాజా సింగ్ వీడియో కాల్ లో ప్రియురాలి తల్లి స్వాతి సింగ్ ను ఎలా చంపాలి అంటూ ప్రియురాలికి సూచనలు, సలహాలు ఇచ్చాడు.

నిమ్మకాయ జ్యూస్ లో నిద్రమాత్రలు మిక్స్ చేసి చంపేసిన కూతురు
మీ అమ్మకు నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వాలని, తరువాత గొంతు నులిమి చంపేయాలని ప్రియుడు రాజా సింగ్ అతని ప్రియురాలికి చెప్పాడు. జులై 10వ తేదీన స్వాతి సింగ్ ఇంట్లో లేని సమయంలో అక్కడికి వెళ్లిన ప్రియుడు రాజా సింగ్ అతని ప్రియురాలికి కొన్ని నిద్రమాత్రలు ఇచ్చాడు. ప్రియుడు రాజా సింగ్ చెప్పినట్లే ప్రియురాలు జులై 10వ తేదీ రాత్రి నిమ్మరసంలో ఎక్కువ నిద్రమాతలు కలిపి తల్లికి ఇచ్చింది. నిమ్మరసం తాగిన స్వాతి సింగ్ మత్తులోకి జారిపోవడంతో అదే రోజు అర్దరాత్రి కూతురు ప్రియుడు రాజా సింగ్ తో కలిసి తల్లి స్వాతి సింగ్ ను చంపేశారు.

డ్రామాలు ఆడిన కూతురు
తన తల్లి స్వాతి సింగ్ అనారోగ్యంతో మరణించిందని మొదట ఆమె కూతురు అందరినీ నమ్మించడానికి ప్రయత్నించింది. స్వాతి సింగ్ కూతురికి ప్రియుడు రాజా సింగ్ ఉన్నాడని, ఇదే విషయంలో తల్లీ కూతురికి అనేకసార్లు గొడవలు జరిగాయని బంధువులు, స్థానికులు పోలీసులకు చెప్పారు. స్వాతి సింగ్ ను ఆమె కూతురే హత్య చేసి ఉంటుందని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు.

ప్రియుడికి బెండ్ తీస్తే అసలు మ్యాటర్ లీక్
ప్రియుడు రాజా సింగ్ అను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా స్వాతి సింగ్ హత్యకు గురైన విషయం బయటకు వచ్చిందని ఫరీదాబాద్ జిల్లా పోలీసు శాఖా పీఆర్ ఓ సుబే సింగ్ మీడియాకు చెప్పారు. స్వాతి సింగ్ ను హత్య చెయ్యడానికి తానే నిద్రమాత్రలు తీసుకెళ్లి ఇచ్చానని రాజా సింగ్ అంగీకరించాడని పోలీసు అధికారులు చెప్పారు.

చచ్చినా పట్టించుకోము
రాజా సింగ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించామని, స్వాతి సింగ్ ను హత్య చేసిన ఆమె కూతురిని అరెస్టు చేసి జువైనల్ హోమ్ కు తరలించామని పోలీసులు అధికారులు చెప్పారు. 16 ఏళ్ల వయసులో ప్రియుడి మోజులో పడిన యువతి కన్న తల్లిని సినిమా లెవల్లో చంపేయడం ఫరీదాబాద్ లో కలకలం రేపింది. తల్లిని చంపిన కూతురు జైల్లో చచ్చినా మేము పట్టించుకోమని, బెయిల్ కూడా ఇప్పించమని స్వాతి సింగ్ బంధువులు అంటున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications