కరోనావేళ వింత జననం: అది చూస్తూనే అందరికీ షాక్..!
అస్సాం: కొద్ది రోజుల క్రితం తెలంగాణలో రెండు తలల గొర్రె పుట్టింది. అది ఆరోగ్యంగా కూడా ఉన్నింది. తాజాగా అలాంటి ఘటనే అస్సాంలో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ గొర్రె కాదు.. ఓ వింత రూపంలో పంది పుట్టింది. ఈ పంది పిల్లకు రెండు తలలు, రెండు ముక్కులు మూడు కళ్లు ఉన్నాయి. ఈ పందిపిల్ల సంగతేంటో తెలుసుకోవాలంటే అస్సాంలోని హాన్‌సింగ్ ఇంగీ అనే రైతు ఇంటికి వెళ్లాల్సిందే.
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పంది పిల్లను జాగ్రత్తగా పరిశీలించండి. దీనికి రెండు తలలు, రెండు ముక్కులు ,మూడు కళ్లు ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే అస్సాంలోని వెస్ట్ కార్బి అంగ్లాంగ్ జిల్లాలోని మెన్మ్‌జీముఖి గ్రామంలో హాన్‌సింగ్ ఇంగీ అనే రైతు పొలంలో ఓ పంది ఏడు పంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఇందులో ఒకటి చాలా వింతగా పుట్టింది. రెండు తలలు మూడు కళ్లు, రెండు ముక్కులు ఉండి పుట్టింది. ఇక రెండు తలలతో పంది పుట్టిందన్న విషయం తెలుసుకున్న వార్త దావనంలా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల వారు ఈ పందిని చూసేందుకు రైతు హాన్‌సింగ్ ఇంటికి క్యూకట్టారు.

Recommended Video
పందిని గత ఐదేళ్లుగా పెంచుతున్నట్లు హాన్‌సింగ్ చెప్పారు. అయితే రెండు తలల పంది పిల్లను చూసి షాక్ అయినట్లు వెల్లడించాడు. ఇక వింత రూపంలో పుట్టిన ఈ పంది పిల్లకు మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. ఈ పంది పిల్ల కాళ్లల్లో శక్తి లేదని నడవలేక పోతోందని చెప్పాడు. ఇదిలా ఉంటే ఇలాంటి రూపంలో పుట్టే జంతువులు ఎక్కువ రోజులు బతకవని వెటరనరీ డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా పందులు కానీ ఇతర జంతువులు కానీ అసాధారణ రీతిలో జన్మించడం చాలా అరుదుగా జరుగుతుందని అలాంటివి ఎక్కువ కాలం బతకవని వెటరనరీ డాక్టర్లు చెబుతున్నారు. పుట్టిన కొన్ని వారాలకే ఇవి చనిపోతాయని వెటరనరీ డాక్టర్ సంజీవ్ మిశ్రా తెలిపాడు. ఇక రెండు తలల పంది పిల్ల పుట్టిందన్న వార్త గ్రామంలో తెలియగానే దాన్ని చూసేందుకు గ్రామస్తులంతా హాన్‌సింగ్ ఇంటికి తరలివచ్చారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications