వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరిగి వస్తారని: 6వారాలుగా డీప్ ఫ్రీజర్‌లో మృతదేహం

|
Google Oneindia TeluguNews

Dead Indian guru in freezer for 'deep meditation'
ఛండీఘర్: చనిపోయిన ఆధ్యాత్మిక గురువు మళ్లీ తిరిగి బతికి వస్తారని నమ్ముతున్న అతని అనుచరులు ఆ గురువు మృతదేహాన్ని ఆశ్రమంలోనే ఆరు వారాలుగా డీప్ ఫ్రీజర్‌లో ఉంచుతున్నారు. తమ గురువు తప్పకుండా తిరిగి వస్తారని, తమకు మార్గనిర్దేశనం చేస్తారని ఆశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆధ్యాత్మిక గురువు అషుతోష్ మహరాజ్ జనవరి 29న భౌతికంగా మృతి చెందారు.

కాగా అప్పట్నుంచి అతని మృతదేహాన్ని శిశ్యులు డీప్ ఫ్రీజర్‌లో ఉంచుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని నుర్మహల్ పట్టణంలో విస్తరించిన ఆశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా మహరాజ్ గురు.. దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్‌కు నాయకత్వం వహిస్తున్నారని అనుచరులు చెప్పారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అనుచరులు ఉన్నారని తెలిపారు.

ఆశ్రమ సంస్థ ప్రతినిధి స్వామి విశాలానంద్ మాట్లాడుతూ.. తమ గురువు అషుతోష్ మహరాజ్ చనిపోలేదని, సమాధిలో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం తమ గురువు గాఢమైన ధ్యానంలో ఉన్నారని, ఆయన చేతన స్థితిలోనే ఉన్నారని తెలిపారు. ఆయన అనుచరులంతా ధ్యానం నుంచి ఎప్పుడు బయటికి వస్తారా అని ఎదురు చూస్తున్నారని విశాలానంద్ చెప్పారు. అప్పటి వరకు ఆశ్రమం తెరిచే ఉంటుందని, అనుచరులు, శిశ్యులు తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధ్యానం కొనసాగిస్తారని తెలిపారు.

తమ గురువు ధ్యాన స్థితిలో నుంచే శిశ్యులకు సూచనలు చేస్తున్నారని, ఆయన తిరిగి వచ్చే వరకూ తన శరీరాన్ని కాపాడాలని చెప్పారని విశాలానంద్ తెలిపారు. కాగా అషుతోష్ మహరాజ్ మృతదేహాన్ని డీప్ ఫ్రీజర్ ఉంచడంపై స్వామిజీ మాజీ డ్రైవర్ కోర్టును ఆశ్రయించాడు. గురువు ఆస్తిలో వాటా కోసమే ఆయన మృతదేహాన్ని డీప్ ఫ్రీజర్ ఉంచుతున్నారని ఆయన అనుచరులపై ఆరోపణలు కూడా చేసినట్లు తెలిసింది. అయితే స్వామిజీ మృతి చెందాడని అధికార వర్గాలు ధృవీకరించడంతో కోర్టు అతని పిటిషన్‌ను తిరస్కరించినట్లు పంజాబ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రీతా కోహ్లీ తెలిపారు.

మహరాజ్ గురు శరీరాన్ని తమతోనే ఉంచుకోవాలని ఆశ్రమంలోని అతని అనుచరులు నిర్ణయించుకున్నట్లు కోహ్లీ చెప్పారు. ఈ కేసు కోర్టులో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని జిల్లా పోలీసు ఉన్నతాధికారి గురిందర్ సింగ్ దిల్లన్ తెలిపారు. 19883లో అషుతోష్ మహారాజ్‌చే ఈ ఆశ్రమం స్థాపించబడిందని, ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు, అనుచరులు ఉన్నారని స్వామిజీకి సంబంధించిన వెబ్‌సైట్‌ పేర్కొంటుంది. కాగా స్వామిజీ తిరిగి వస్తారని, కళ్లు మూసుకుని ధ్యానం చేస్తే అతను తమతో మాట్లాడుతాడని స్వామిజీ భక్తులు చెబుతున్నారు.

English summary
An Indian guru declared dead has been in a deep freezer in his ashram for nearly six weeks with followers confident he will return to life to lead them, his spokesman said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X