ఇయర్ ఎండ్ లో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే..

భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు.. చారిత్రాత్మక ప్రదేశాలకు పెట్టింది పేరు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ చూడాల్సిన ప్రదేశాలు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అందుకే చాలా మంది టైమ్ దొరికితే చాలు టూర్లకు వెళ్తుంటారు.​ అయితే టూర్లకు వెళ్లడానికి శీతాకాలం అనువైన సమయంగా చెబుతుంటారు. ఎందుకంటే చల్లని వాతావరణం, ఎటు చూసినా పచ్చటి ప్రకృతి అందాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. మరి శీతాకాలంలో సందర్శించాల్సిన ప్రదేశాలు ఏంటి? అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? వాటి ప్రత్యేకతలు ఏంటి?

ఈ సమయంలో మంచు అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. శీతాకాలంలో కాశ్మీర్ టూర్ మరచిపోలేని అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్ లోని గుల్మార్గ్ ప్రాంతం స్వర్గధామంగా ఉంటుంది. తెల్లటి మంచు దుప్పటిని కప్పుకుని పర్యాటకులను ఆకర్షిస్తోంది. గుల్మార్గ్ ప్రాంతంలో స్కీయింగ్, స్నో బోర్డింగ్, అలాగే గోండోలా రైడ్ అంటే ప్రపంచంలోనే ఎత్తయిన కేబుల్ కారు ప్రయాణం.. తదితర ప్రత్యేకతల కారణంగా ఈ పర్యటక ప్రాంతం టూరిస్టులతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడ దాల్ సరస్సుపై జర్నీ గొప్ప అనుభూతిని ఇస్తుంది.

అలాగే ఉత్తరాఖండ్‌ లోని హరిద్వార్, రిషికేశ్ ప్రసిద్ధ ఆధ్యాత్మిక, యాత్రా స్థలాలుగా గుర్తింపు పొందాయి. ఈ నగరాలు గంగా నది ఒడ్డున ఉన్నాయి. డిసెంబర్ నెలలో ఇక్కడి వాతావరణం చాలా చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఈ సీజన్ లో పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ ప్రాంతానికి తరలివస్తుంటారు. ఈ ప్రాంతం ఆధ్యాత్మికంతోపాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ కు కూడా పెట్టింది పేరు. రివర్ రాఫ్టింగ్, బంజీ జంపింగ్, యోగా కేంద్రాలు పర్యటకుల్ని ఆకట్టుకుంటాయి. అలాగే సాయంత్రం వేళ ఇక్కడ జరిగే గంగా హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే హరిద్వార్ లో భారతమాత ఆలయం, చండీదేవి ఆలయం చూడదగిన ప్రదేశాలు. మానసా దేవి ఆలయానికి రోప్‌ వే ద్వారా రైడింగ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.

December Dream Destinations Top Must-Visit Spots for Holiday Magic and Winter Escapes

కేరళలోని అందాలను చూడాలంటే మున్నార్, అలప్పుజ ప్రాంతాలకు వెళ్లాల్సిందే. కేరళలోని రెండు విభిన్నమైన, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలుగా ఇవి ఉన్నాయి. మున్నార్ టీ తోటలు, కొండల మధ్య చల్లని వాతావరణంతో కూడిన హిల్ స్టేషన్ కాగా.. అలప్పుజ సముద్రంలోని బ్యాక్‌ వాటర్స్, హౌస్‌ బోట్ క్రూయిజ్‌ లకు ప్రసిద్ధి చెందింది. అలాగే ఇక్కడ ఆయుర్వేద మసాజ్ లు, పచ్చని ప్రకృతి ఆకట్టుకుంటాయి. హౌజ్ బోట్ లో రాత్రి బస చేస్తూ కేరళ టేస్టీ ఫుడ్ ను ఆస్వాదించడం అందమైన అనుభూతిని అందిస్తాయి.

ఇక గోవా అందాలు మాటల్లో చెప్పలేని విధంగా ఉంటాయి. ఇయర్ ఎండ్ లో చాలామంది పర్యటకులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు గోవాలో వాలిపోతుంటారు. అందుకే ఇక్కడ డిసెంబర్ నెలలో పర్యటకులతో కళకళలాడుతుంది. ఇక్కడి సీ ఫుడ్, వాటర్ స్పోర్ట్స్, నైట్ పార్టీలు స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయి. అలాగే గోవాలోని పురాతన చర్చిలు, సన్ రైజ్.. సన్ సెట్ పాయింట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+