జయ మేనకోడలు దీపా భర్త కొత్త పార్టీ: మైకల్ జాక్సన్ పార్టీ అంటూ, వైరల్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: జయలలిత మేనకోడలు దీపా, ఆమె భర్త మాధవన్ గొడవ తారాస్థాయికి చేరింది. ఇంత వరకు ఇంటికే పరిమితం అయిన వీరిద్దరి గొడవ ఇప్పుడు వేరువేరు పార్టీలు పెట్టుకునే వరకు రావడంతో వారి అనుచరులు రెండు వర్గాలుగా చీలిపోయారు.

శుక్రవారం దీపా భర్త కొత్త పార్టీని స్థాపించారు. శుక్రవారం మేరీనా బీచ్ లోని జయలలిత సమాది వద్దకు తన అనుచురులతో చేరుకున్న మాధవన్ ప్రత్యేక పూజలు చేశారు. తరువాత దీపా భర్త మాధవన్ ఎంజేడీఎంకే పార్టీని స్థాపిస్తున్నానని ప్రకటించారు.

సోషల్ మీడియాలో ఇలా

సోషల్ మీడియాలో ఇలా

దీపాతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడో ? ఏమో ? మాధవన్ కొత్త పార్టీ పెట్టి తన భార్య దీపాకు ఝలక్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే ఆయన కొత్త పార్టీ పెట్టిన కొంత సేపటికే సోషల్ మీడియాలో మాధవన్ మీద జోకులు పేలుతున్నాయి.

మాకు పనిపాట లేదనుకుంటున్నారా ?

మాకు పనిపాట లేదనుకుంటున్నారా ?

కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో మాధవన్ కు క్లాస్ పీకారు. తమిళనాడులో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రాజకీయా పార్టీ పెట్టుకుంటూ వెలుతున్నారని, మాకు పనిపాట లేకుండా మీ వెంట తిరగాలని అనుకుంటున్నారా ? అంటూ మాధవన్ ను సూటిగా ప్రశ్నించారు.

ఎంజే అంటే మైకల్ జాక్సన్ అనేనా గురు

ఎంజే అంటే మైకల్ జాక్సన్ అనేనా గురు

ఎంజేడీఎంకే అంటే ఓ యువకుడు పేల్చిన జోకు ఇప్పుడు వైరల్ అయ్యింది. తమిళనాడులో ఇప్పుడు మైకల్ జాక్సన్ ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ వచ్చింది నారాయణ (ఏడుకోండల స్వామి) అంటూ జోక్ చెయ్యడంతో వైరల్ అయ్యింది.

10 మంది ఉంటే కొత్త పార్టీనా

10 మంది ఉంటే కొత్త పార్టీనా

కేవలం 10 మందిని వెంట తీసుకు వచ్చి జయలలిత సమాది దగ్గర తాను కొత్త పార్టీ పెడుతున్నానని మాధవన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. కేవలం దీపా భర్త అనే అర్హత తప్పా నీకు ఏలాంటి హోదా ఉందని మాధవన్ నూ సోషల్ మీడియాలో సూటిగా ప్రశ్నిస్తున్నారు.

దెబ్బకు దెయ్యం దిగింది

దెబ్బకు దెయ్యం దిగింది

సోషల్ మీడియాలో మాధవన్ కు ఎడాపెడా చివాట్లు పెట్టడంతో ఆయన అనుచరులు ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. దీపా వెంట ఉన్నా మంచిదే కాదా, కనీసం ఆమె జయలలిత మేనకోడలు అనే విషయం ప్రపంచానికి తెలుసని, మాధవన్ తో ఉంటే ఏం వస్తోంది అంటూ అయోమయంలో పడ్డారు.

మీ భార్య పార్టీ పెట్టారు, ఇప్పుడు మీరు ?

మీ భార్య పార్టీ పెట్టారు, ఇప్పుడు మీరు ?


ఇప్పటికే మీ భార్య దీపా జయకుమార్ ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై అనే పార్టీ పెట్టారు. ఇప్పుడు మీరు కూడా పార్టీ పెట్టి తమిళనాడు ప్రజలను ఏం చెయ్యాలని అనుకుంటున్నారు అంటూ మాధవన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Deepa husband Madhavan has started a new paraty named MJDMK. For this netizens making fun of him. Already his wife Deepa has started the party.
Please Wait while comments are loading...