అన్నాడీఎంకే, ఆ పార్టీ జెండాను కాపాడేది నేనే: జయలలిత మేనకోడలు దీపా, ఈసీకి లేఖ!

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ, ఆ పార్టీ రెండాకుల చిహ్నం తానే కాపాడుతానని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా అన్నారు. జయలలిత ప్రాణాలను ఫలంగా పెట్టి అన్నాడీఎంకే పార్టీని కాపాడుకుంటూ వచ్చారని దీపా చెప్పారు.

చెన్నైలో ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై అధ్యక్షురాలు జే. దీపా మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీని ఎంజీఆర్ స్థాపించారని, ఆయన తరువాత 2016 చివరికి వరకూ ఆ పార్టీని జయలలిత కాపాడుకుంటూ వచ్చారని దీపా అన్నారు. అయితే జయలలిత మరణించిన తరువాత పార్టీ ముక్కలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Deepa says that I will save theAIADMK party and the flag.

పేదల కష్టాలు తీర్చడానికి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జయలలిత తమిళనాడు ప్రజలకు ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు. అయితే కొందరు స్వార్థంతో పార్టీని నాశనం చెయ్యడానికి సిద్దం అయ్యారని జయలలిత మేనకోడలు దీపా ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం తానే కాపాడుకుంటానని దీపా ధీమా వ్యక్తం చేశారు. అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితుల నుంచి అన్నాడీఎంకేని చెక్కబెట్టేందుకు వెంటనే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు జరిపించాలని దీపా ఎన్నికల కమిషన్ కు వినతి పత్రం సమర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+