నటి దీపికా పడుకొన్ సంచలన వ్యాఖ్యలు.. రోజరోజుకూ దిగజారుతోంది.. అందుకే కొపమొచ్చింది..
Recommended Video
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో దుడగుల దాడిలో గాయపడ్డ విద్యార్థుల్ని పరామర్శించడంపై పెద్ద ఎత్తున విమర్శలకు నటి దీపికా పదుకొనె ఘాటుగా బదులిచ్చారు. తన కొత్త సినిమా 'చపాక్' ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన ఆమె.. మంగళవారం రాత్రి జేఎన్‌యూకు వెళ్లి విద్యార్థుల నిరసనలో పాలుపంచుకున్నారు. అరగంటకుపైగా క్యాపస్ లోనే ఉన్నారు. దుండగుల దాడిలో గాయపడ్డ స్టూడెంట్ యూయిన్ ప్రెసిడెంట్ ఐషే ఘోష్, ఇతర విద్యార్థుల్ని దీపిక పరామర్శించారు. నటి చర్యను తప్పుపట్టిన బీజేపీ, ఇతర హిందూ సంఘాలు ఆమె సినిమాల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

హింస సాధారణ విషయమైతే ఎలా?
జేఎన్‌యూ సందర్శనపై మీడియాతో మాట్లాడిన దీపిక సంచలన కామెంట్లు చేశారు. ‘‘ఇవాళ నేను కొత్తగా మాట్లాడేదేమీ లేదు. నేను చెప్పదల్చుకున్నది రెండేళ్ల కిందటే.. పద్మావత్ సినిమా విడుదల టైమ్ లోనే చెప్పేశా. ఆరోజు నేను దేనికి భయపడ్డానో ఇప్పటికీ అదే జరుగుతోంది. పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నట్లనిపిస్తోంది. ఎవరుపడితేవాళ్లు ఏదైనా మాట్లాడేసి, వ్యతిరేకించినవాళ్లపై దాడులు చేయడం దారుణం. హింస అనేది ఒక సాధారణ విషయంగా మారిపోవడం చాలా బాధాకరం. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను.. మన దేశం నిలబడింది ఈ రకమైన పునాదులమీద కాదు''అని వివరించారు.

అప్పుడు ఇంకా కోపమొచ్చింది..
నొప్పి బాధేంటో తెలుసు కాబట్టే జేఎన్‌యూలో దెబ్బలుతిన్న విద్యార్థుల్ని పరామర్శించానని దీపిక తెలిపారు. విద్యార్థులపై దుండగులు విచక్షణా రహితంగా దాడి చేయడం ఒకటైతే.. పోలీసులు కనీసమాత్రంగానైనా స్పందిచక పోవడం, నిందితులపై యాక్షన్ తీసుకోకపోవడం బాగా కోపం తెప్పించిందని ఆమె చెప్పారు.

చపాక్ సినిమాపై పొలిటికల్ లొల్లి
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితగాథ ఆధారంగా దీపిక లీడ్ రోల్ లో నటించిన ‘చపాక్'సినిమా వివాదంలో చిక్కుకుంది. జేఎన్‌యూ స్టూడెంట్లకు దీపిక మద్దతివ్వడంపై బీజేపీ మండిపడింది. శుక్రవారం(ఈనెల 10న) విడుదల కానున్న చపాక్ తోపాటు దీపిక మిగతా సినిమాలను బహిష్కరించాలంటూ ఢిల్లీ బీజేపీ కీలక నేత తేజిందర్ సింగ్ బగ్గా ఇచ్చిన పిలుపును దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సమర్థంచారు. చపాక్ సినిమాను అడ్డుకుంటామని పలువురు నేతలు ప్రకటనలు చేశారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications