girlfriend: లవర్ ను చంపి శవాన్ని ఫ్రీజర్ లో పెట్టాడు. అదే రోజు వేరే అమ్మాయితో పెళ్లి, శాడిస్టు !

న్యూఢిల్లీ/ముంబాయి: తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి తప్పు చేస్తే ఏదో తెలియని వయసు అనుకుంటారు. మేజర్ అమ్మాయిలు సైతం కేటుగాళ్ల మాయమాటలు నమ్మి వారిని గుడ్డిగా నమ్మి వారితో శారీరక సంబంధం పెట్టుకుని మోసపోతున్నారు. మోసపోయిన కొందరు అమ్మాయిలు తరువాత వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉంటున్నారు. అయితే ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని మొండిపట్టుతో కొందరు అమ్మాయిలు వారీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఢిల్లీలోని శ్రద్దా హత్య కేసు తరహాలోనే అదే ఢిల్లీలో మరో యువకుడు హిందూ యువతిని చంపేసి శవాన్ని ఫ్రీజర్ లో పెట్టాడు. అయితే ప్రియురాలిని హత్య చేసిన రోజే మరో అమ్మాయిని ప్రియుడు పెళ్లి చేసుకున్నాడు.

 బస్సులో పరిచయం..... ప్రేమలో పడిన యువతి

బస్సులో పరిచయం..... ప్రేమలో పడిన యువతి

రాజధాని ఢిల్లీలోని నజర్‌గఢ్‌కు చెందిన సాహిల్ ఖేలత్ అలియాస్ సాహిల్ (24) అనే వ్యక్తి ధాబా రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఢిల్లీలో మెడిసిన్ చదువుతున్న హర్యానాకు చెందిన నిక్కీ యాదవ్‌ (24)తో బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో పరిచయం అయ్యింది. తరువాత సాహిల్, నిక్కీ యాదవ్ ప్రేమలో పడ్డారు. నిక్కీ యాదవ్ చదువుకోడానికి వెళ్లి వస్తూ ఆమె బాయ్ ఫ్రెండ్ సాహిల్ ను కలవడం మొదలుపెట్టిందది.

 విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేసిన లవర్స్

విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేసిన లవర్స్

సాహిల్, నిక్కీ యాదవ్ పార్క్ లు, సినిమా థియేటర్లలో తిరుగుతూ ఎంజాయ్ చేశారు. తరువాత నిక్కీ యాదవ్, సాహిల్ ఇద్దరూ నోయిడాలోని ఒక కళాశాలలో ఒకే కోర్సులో చేరారు. అక్కడే అద్దె ఇంట్లో ఇద్దరూ కలిసి నివసించారని తెలిసింది. సాహిల్ అతని ప్రియురాలు నిక్కీ యాదవ్ తో కలిసి మనాలి, రిషికేశ్, హరిద్వార్‌ తదితర ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేశారని తెలిసింది.

 పెళ్లి చేసుకోవాలని ప్రియురాలి ఒత్తిడి

పెళ్లి చేసుకోవాలని ప్రియురాలి ఒత్తిడి

తనను పెళ్లి చేసుకోవాలని నిక్కీ యాదవ్ పట్టుబట్టినా సాహిల్ మాత్రం అతని ప్రియురాలు నిక్కీ యీదవ్ మాటలను పట్టించుకోలేదు. సాహిల్ అతను ప్రేమించిన అమ్మాయి నిక్కీ యాదవ్ ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. తన ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనే విషయం తెలుసుకున్న నిక్కీ యాదవ్ ఆమె ప్రియుడు సాహిల్‌ను పెళ్లి చేసుకోవాలని, లేదంటే నీ మీద కేసు పెడుతానని గొడవ చేసింది.

 మొబైల్ చార్జర్ తో గర్ల్ ఫ్రెండ్ ను చంపేశాడు

మొబైల్ చార్జర్ తో గర్ల్ ఫ్రెండ్ ను చంపేశాడు

దీంతో ప్రియురాలు నిక్కీ యాదవ్ మీద ఆగ్రహంతో రగిలిపోయిన సాహిల్ కారులో మొబైల్‌ చార్జింగ్‌ చేసే చార్జర్ కేబుల్‌ తీసుకుని అతని ప్రియురాలు నిక్కీ యాదవ్‌ గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం నిక్కీ యీదవ్ మృతదేహాన్ని థాపా హోటల్‌లోని ఫ్రీజర్‌ బాక్స్‌లో దాచిపెట్టాడు. ప్రియురాలు నిక్కీ యాదవ్ పీడపోయిందని సాహిల్ అనుకున్నాడు.

 ప్రియురాలిని చంపిన రోజే మరో అమ్మాయితో పెళ్లి

ప్రియురాలిని చంపిన రోజే మరో అమ్మాయితో పెళ్లి

ప్రియురాలు నిక్కీ యాదవ్ ని హత్య చేసిన రోజే సాహిల్ ఎలాంటి భయం లేకుండా అతని ఊరికి వెళ్లి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. నిక్కీ యాదవ్ హత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్ కు చేరుకుని ఫ్రీజర్ బాక్స్‌లో ఉన్న మృతదేహాన్ని తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 ప్రియుడికి ఎలాంటి ఫీలింగ్ లేదు

ప్రియుడికి ఎలాంటి ఫీలింగ్ లేదు

నిక్కీ యాదవ్ హత్యకు గురై మూడు రోజులు అయి ఉంటుందని పోలీసులు అంటున్నారు. సాహిల్‌ను అతని స్వగ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని విచారణ చేస్తున్నారు. అయితే ప్రియురాలు నిక్కీ యాదవ్ ను హత్య చేశానని సాహిల్ కు ఎలాంటి ఫీలింగ్ లేదని పోలీసులు అంటున్నారు. ఢిల్లీలో ప్రియురాలు శ్రద్దాను ఆమె ప్రియుడు అఫ్తాబ్ దారుణంగా హత్య చేసిన సంఘటన మరువక ముందే మరోసారి అదే ఢిల్లీలో అలాంటి ఘటన జరగడంతో ప్రజలు హడలిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+