కేజ్రీవాల్ బిగ్ డెసిషన్..!!

Arvind Kejriwal: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఢిల్లీ. ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇంకొద్ది రోజుల్లొ దీనికి సంబంధించిన షెడ్యూల్ వెలువడనుంది. షెడ్యూల్‌ రూపకల్పనపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తు సాగిస్తోన్నారు.

మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరట్లేదా పార్టీ ఓటుబ్యాంక్. 1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది.

Delhi Assembly election 2025 AAP reportedly finalised 15 seats for Congress

అప్పటి నుంచీ ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వస్తోన్నారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తోన్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు ఏ మాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి. ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు పార్టీలు.

అదే సమయంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికీ పక్కా వ్యూహాలను పన్నుతోంది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ. వరుసగా మూడోసారి అధికారాన్ని అందుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. దేశ రాజధానిపై తనకు ఉన్న పట్టును నిరూపించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో మరో అడుగు ముందుకు పడింది. కాంగ్రెస్‌తో సీట్లు పంపకాలు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ఆ పార్టీకి 15 సీట్లను కేటాయించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నాయకత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. అలాగే- ఇండియా బ్లాక్ భాగస్వామ్య పక్షాలకు ఒకటి లేదా రెండు నియోజకవర్గాలను ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మొత్తం 70 నియోజకవర్గాల్లో ఏఏ స్థానాలను కాంగ్రెస్, ఇతర ఇండియా బ్లాక్ పార్టీలకు కేటాయించాలనే విషయంపై ఇంకా తేల్చాల్సి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ స్థానాలను వదులుకుంటుంది? పొత్తు వల్ల టికెట్లు కోల్పోవాల్సి వచ్చే నాయకులు ఎలా స్పందిస్తారు? విషయాలపై అంతర్గతంగా చర్చలు సాగిస్తోంది ఆప్.

పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడని కేజ్రీవాల్ భావిస్తోన్నారు. అలాగే- కాంగ్రెస్ కూడా దాదాపుగా ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఫలితంగా కనీసం అయిదారు సీట్లు కేటాయింపుల్లో ప్రతిష్ఠంభన ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+