ఈసీ పనితీరుపై మళ్లీ అనుమానాలు- పదో తరగతి పిల్లాడికైనా అర్థమౌతోంది

Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వెలువడుతోన్నాయి. బీజేపీ ప్రభంజనం కనిపించింది. ఆ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకపడినట్టే. ఇక కాంగ్రెస్‌ పార్టీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో తలి సారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరలేదా పార్టీ ఓటుబ్యాంక్. ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీనికి అనుగుణంగా ఫలితాలు వెలువడుతున్నాయి. క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది బీజేపీ.

Delhi Assembly Election 2025 Results Why EC did not uploaded Form 17C AAP raises questions

ముఖ్యమంత్రి ఆతిషి, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కీలక అభ్యర్థులు వెనుకంజలో నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2020 తరహాలో ఈ ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోవనే సంకేతాలను ఇచ్చినట్టయింది.

వెనుకంజలో ఉన్న కీలక అభ్యర్థుల్లో.. అరవింద్ కేజ్రీవాల్- న్యూఢిల్లీ, అతిషి- కల్కాజీ, మనీష్ సిసోడియా- జంగ్‌పురా, దుర్గేష్ పాఠక్- రాజీందర్ నగర్, మంత్రి గోపాల్ రాయ్- బాబర్‌పూర్, మనోజ్ త్యాగి- కరావల్ నగర్, అనిల్ ఝా- కిరారీ, దినేష్ మొహానియా - సంగం విహార్, వినయ్ మిశ్రా- ద్వారకా.. వంటి ఆప్ అభ్యర్థలు ఉన్నారు.

ఈ పరిణామాలపై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఘాటు విమర్శలు సంధించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పనితీరు పట్ల అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదివరకు అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఆయన సమర్థించారు.

Delhi Assembly Election 2025 Results Why EC did not uploaded Form 17C AAP raises questions

ఫామ్ 17సీని కేంద్ర ఎన్నికల కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 10వ తరగతి చదువుకునే పిల్లాడికైనా అప్‌లోడ్ చేయడం తెలుసునని, ఈసీకి మాత్రం ఆ పని ఎందుకు చేయలేకపోతోందంటూ నిలదీశారు. ఒక పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలల్లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయనే వివరాలను వెల్లడించే ఫామ్ ఇది.

దీన్ని అప్‌లోడ్ చేయడానికి ఈసీ ఎందుకు వ్యతిరేకించిందంటూ సంజయ్ సింగ్ ప్రశ్నించారు. అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఈసీ వెనుకంజ వేసిందనుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రజా తీర్పును సైతం పక్కదారి పట్టించేలా ఈసీ వ్యవహరిస్తోందంటూ ఆరోపించారాయన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+