ప్రచారానికి డబ్బుల్లేవట: సీఎం క్రౌడ్ ఫండింగ్..!!
CM Atishi: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల వేడి ప్రతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతోన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. కాంగ్రెస్ కూడా సొంతంగా బరిలో దిగిన త్రిముఖ పోటీ ఏర్పడటం ఖాయమౌతుంది.
ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. అదే నెల 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ నెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఆ రోజు నుంచి నామనేషన్లను దాఖలు చేయవచ్చు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 17.

ఈ పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి ఆతిషి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం కొత్త కాన్సెప్ట్‌తో తెర మీదికి వచ్చారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులను సమీకరించుకోవాలని నిర్ణయించారు. తన నియోజకవర్గంలో ఈ ఉదయం క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కల్కాజీ ఆమె సొంత నియోజకవర్గం. 2020లో ఆతిషి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. వరుసగా రెండోసారి ఇదే స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. ఆమెపై ధరంవీర్ సింగ్‌ను అభ్యర్థిగా బరిలోకి దించింది బీజేపీ.
ఈ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులను సమీకరించుకుంటోన్నారు ఆతిషి. నమస్కార్.. మై ఆతిషి హూ అంటూ ఓ వీడియో తన అదికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కల్కాజీ సహా ఢిల్లీలో తమ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధి గురించి వివరించారు.
Over the past 5 years, you've stood by me as an MLA, a minister, and now as the Chief Minister of Delhi. None of this would have been possible without your blessings and support.
— Atishi (@AtishiAAP) January 12, 2025
As a young, educated woman, your belief and donations have enabled me to imagine a career in… pic.twitter.com/WbsdqNCGhh
క్రౌడ్ ఫండింగ్‌లో భాగంగా దాతలు విరాళాలను అందించాల్సిన వెబ్ సైట్ లింక్‌నూ దీనికి జత చేశారు. ఎన్నికల ప్రచార ఖర్చులను సమీకరించుకోవడానికి తాను ఎందుకు క్రౌడ్ ఫండింగ్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఇందులో వెల్లడించారు. 2020లోనూ ఇదే విధానం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించానని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications