'దిల్లీ బ్లాస్ట్ కు ముందు.. హమాస్ రేంజ్ లో విధ్వంసం'..?
దిల్లీ బ్లాస్ట్ ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు బృందం(NIA) దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాంబు దాడికి పాల్పడ్డ కీలక నిందితుడు ఉమర్ నబీకి కీలక అనుచరుడు జసిర్ బిలాల్ వానిని అరెస్టు చేశారు అధికారులు. నవంబర్ 10 దిల్లీ బ్లాస్ట్ కంటే ముందే హమాస్ తరహాలో డ్రోన్లతో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఉమర్ కు డ్రోన్లు, టెక్నికల్ విషయంలో జసిర్ సాయం చేసినట్లు వివరించారు. కాశ్మీర్ కు చెందిన జసిర్ ను విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిల్లీ బాంబు దాడిలో జసిర్ కీలకంగా వ్యవహరించినట్లు అధికారుల విచారణలో తేలింది.
జసిర్ బిలాల్ వాని అలియాస్ డానిష్ కు అత్యంత శక్తివంతమైన డ్రోన్ లను తయారు చేయడంలో నైపుణ్యత ఉన్నట్లు అధికారులు తేల్చారు. డ్రోన్ లకు పెద్ద పెద్ద బ్యాటరీలను అమర్చి వాటి ద్వారా ఎక్కువ విధ్వంసానికి పాల్పడేందుకు కుట్ర పన్నినట్లు తేలింది. కారు బాంబు తయారీలోనూ ఉమర్ నబీకు సాంకేతిక సహకారం అందించినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. అతడి నుంచి మరిన్ని ఆధారాలు రాబడుతున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన అమీర్ రషీద్ అలీను తాజాగా దిల్లీ కోర్టు 10 రోజుల NIA కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. పేలుడుకు ఉపయోగించిన ఐ 20 కారు ఇతని పేరు మీదనే రిజిస్టర్ అయి ఉంది. ఇక అరెస్టయిన అమీర్ రషీద్ జమ్మూ కాశ్మీర్ లోని పాంపోర్ కు చెందిన వాడిగా తేలింది.

ఇక దిల్లీ లోని ఎర్రకోట వద్ద నవంబర్ 10న జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఘటనా సమయంలో 13 మంది చనిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మరో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం ఈ కేసుపై ఎన్ఐఏతో పాటుగా దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ లాంటి సంస్థలు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాయి.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications