హ్యాండ్సాప్ .. గన్ ఎక్కుపెట్టి ... పర్సు, బ్రాస్‌లెట్, మొబైల్ చోరీ ... (వీడియో)

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దోపిడీ దొంగల బీభత్సం కొనసాగుతోంది. ఒంటరిగా ఉన్న మహిళలే కాదు .. ఫ్యామిలీతో ఉన్నవారిని కూడా షేక్ చేస్తున్నారు. ఇంట్లో, పార్కింగ్ వద్ద తుపాకులతో బెదిరిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా అర్ధరాత్రి 3 గంటలకు ఢిల్లీలో దుండగులు చేతిలో తుపాకీ పట్టుకొని .. ఓ భార్యభర్తలను బెదిరించి, నిలువుదోపిడి చేసిన ఘటన కలకలం రేపతుంది.

పాయింట్ బ్లాంక్‌లో ..

పాయింట్ బ్లాంక్‌లో ..

ఢిల్లీలోని మోటల్ టౌన్‌కు చెందిన భార్య, భర్త తమ చిన్నారితో కలిసి బయటకెళ్లారు. అయితే తిరిగొచ్చే సమయం చాలా ఆలస్యమైంది. తెల్లవారుజామున 3 గంటలకు ఇళ్లు చేరుకున్నారు. ఇంటి వద్ద కారు నిలిపివేసి .. గేటు వేసే సమయానికి దొంగలు చొరబడ్డారు. హ్యాండ్సాప్ అంటూ హడలెత్తించారు. వారు ముగ్గురు, అందులో తుపాకీతో ఉండటంతో అతను ఏమీ చేయలేకపోయాడు. దీంతో వారి వద్ద ఉన్న నగలు, నగదును దోచుకెళ్లారు. అయితే అక్కడ ఏర్పాటుచేసిన సీసీటీవీ ఫుటేజీలో దోపిడి దొంగల బీభత్సం రికార్డైంది.

మూకుమ్మడిగా వచ్చి ...

మూకుమ్మడిగా వచ్చి ...

గేటు వేసేందుకు వెళ్లేసరికి దుండగులు ఒక్కొక్కరు వచ్చారు. అతని భార్య కారులో చిన్నారితోపాటు కూర్చొని ఉంది. ఇంతలో ముగ్గురు ఆ వ్యక్తికి చెందిన నగలు, నగదును దోచుకెళ్లారు. కారులో కూర్చొన్న అతని భార్యను కూడా బెదిరించారు. ఆమె ఫోన్ తీసుకుని ..వదిలిపెట్టేశాడు. ఆ దుండగులను వచ్చే సమయంలో చూశానని బాధితుడు తెలిపాడు. అయితే తన ఇంటికొచ్చి తన మెర్సిడెజ్ బెంజ్ కారు పార్కింగ్ చేసేసరికి దుండగులు వచ్చారని పేర్కొన్నారు. అయితే తనను కాల్చేయద్దని .. ఏం కావాలో తీసుకోవాలని చెప్పానని వరుణ్ పేర్కొన్నారు. వారు తన పర్సు, బ్రాస్‌లెట్, తన భార్య ఫోన్ తీసుకున్నారని వెల్లడించారు. మరొ వ్యక్తి కారులో విలువైన వస్తువులు ఉన్నాయా అని శోధించారని వాపోయారు.

చివరికి ఫోన్ ...

అయితే తన భార్య బంగారం ధరించిందా అని పరిశీలించారని గుర్తుచేశారు. పర్సులో కూడా విలువైన వస్తువులు దొరక్కపోవడంతో .. తన ఫోన్ తీసుకున్నారని తెలిపారు. చివరికి డ్రైవర్ సీటు కూర్చొవాలని చెప్పి .. తర్వాత వారు పారిపోయారని వరుణ్ వెల్లడించారు. అయితే తాను నిల్చొవడంతో ఒకడు తుపాకీ తీసి గురిపెట్టాడని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+