18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ ప్రతి నెలా రూ.1,000లు అందజేత

Mukhya Mantri Mahila Samman Yojana: దేశం.. ఎన్నికల ఏడాదిలో ప్రవేశించింది. ఇంకొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ నెల రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

Delhi govt will be providing Rs 1000 per month to every woman aged 18 years and above

ఈ క్రమంలో ఢిల్లీ, పంజాబ్‌లల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం కొత్తగా ఎన్నికల తాయిలాలను ప్రకటించింది. ప్రత్యేకించి మహిళా ఓటుబ్యాంక్‌పై దృష్టి సారించిన ఆ పార్టీ- వరాల జల్లును కురిపించింది. మహిళలను ఆర్థికంగా చేయూత అందించడానికి ఉద్దేశించిన పథకాన్ని ప్రకటించింది.

ఈ పథకం పేరు- ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన. దీని కింద ఢిల్లీలో నివసించే ప్రతి మహిళకు, ప్రతి నెలా 1,000 రూపాయల నగదు మొత్తాన్ని చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రి ఆతిషి వెల్లడించారు. ఈ మేరకు బడ్జెట‌్‌లో ఈ పథకాన్ని పొందుపరిచినట్లు తెలిపారు.

ఈ మధ్యాహ్నం ఆమె అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తమ ప్రభుత్వం వరుసగా పదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోందని, దీనికి గుర్తుగా తమ రాష్ట్రం పరిధిలోని నివసించే ప్రతి మహిళకూ, ప్రతి నెలా 1,000 రూపాయలను మొత్తాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ పథకాన్నిఅమలు చేయడానికి 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల మొత్తం అవసరమౌతుందని అంచనా వేశామని ఆతిషి చెప్పారు. ఈ మేరకు ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చును బడ్జెట్ ప్రతిపాదనల్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ప్రతి మహిళనూ ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను రూపొందించామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+