RCB: రజినీకాంత్ ‘జైలర్’ నుంచి ఆ సీన్ తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశం

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విడుదలైన నాటి నుంచి మంచి టాక్‌తో.. భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ క్రమంలో జైలర్ మూవీ బృందానికి అనుకోని షాక్ తగిలింది. ఈ సినిమాలో తమ జట్టు జెర్సీని ఉపయోగించడంపై ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభ్యంతరం వ్యక్తం చేసింది.

అంతేగాక, జైలర్ సినిమాలో ఓ సీన్‌పై ఆర్సీబీ మేనేజ్మెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆ సీన్‌ను సినిమాలోంచి తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు చిత్ర నిర్మాతలను ఆదేశించింది.

Delhi high court ordered jailer team to remove rcb jersey from movie scene

ఆ సీన్ విషయానికొస్తే.. జైలర్ చిత్రం ఫస్టాఫ్‌లో రజినీకాంత్ మద్యం మత్తులో ఉన్నప్పుడు.. ఆయనను ఇద్దరు విలన్ మనుషులు ఫాలో అవుతుంటారు. రజినీ వారి కదలికలను ముందే పసిగట్టి.. ఒక చోట కార్నర్ చేసి వారిని చంపేస్తాడు. ఈ సీన్‌లో ఇద్దరు రౌడీల్లో ఒకరు ఆర్సీబీ జెర్సీ వేసుకుని ఉంటాడు. ఈ సీన్ పట్ల ఆర్సీబీ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

చెన్నై సూపర్ కింగ్స్‌తో పోలిస్తే ఆర్సీబీని తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశంతోనే ఈ సీన్ చిత్రీకరించారని మండిపడ్డారు. చివరకు ఈ విషయం ఆర్సీబీ మేనేజ్మెంట్‌ను చేరడంతో.. వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జైలర్ సినిమాలో కాంట్రాక్ట్ కిల్లర్ తమ జట్టు జెర్సీ ధరించి ఒక మహిళ గురించి అవమానకరమైన, స్త్రీ ద్వేషపూరిత ప్రకటనలు చేశాడని పేర్కొన్నారు.

అనుమతి లేకుండా తమ జెర్సీని ఉపయోగించడం వల్ల తమ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆర్సీబీ తరపు న్యాయవాదులు వాదించారు. వీరి వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. సెప్టెంబర్ 1 నుంచి ఆర్సీబీ జెర్సీ ధరించి ఉన్న దృశ్యాలను థియేటర్లలో ప్రదర్శించరాదని జైలర్ చిత్ర నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+