Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోమాలో ఉన్న భర్త వీర్యం కోసం ఆ మహిళ ఏం చేసిందంటే..?

కోమాలో ఉన్న భర్త వీర్యం కోసం ఆ మహిళ కీలక నిర్ణయం తీసుకుంది. తన భర్త వీర్యం కావాలంటూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్త వీర్యంతో బిడ్డను కనాలని కోరుకుంటున్నట్లు కోర్టుకు వివరించింది ఆ మహిళ. ఆ మహిళ భర్త 2025 మార్చి నుంచి కోమాలో ఉన్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతడు ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ పై ఉన్నాడు. అయితే ఈ మేరకు అతడి భార్య దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త వీర్యం కావాలని ఆ వీర్యంతో భవిష్యత్తులో తాను బిడ్డను కనాలని కోరుకుంటున్నట్లు పిటిషన్ లో వివరించింది.

ఇదే విషయంపై ఆ మహిళ తరఫు న్యాయవాది అర్జిత్ గౌర్ మాట్లాడుతూ.. తన భర్త వీర్యాన్ని భద్రపరచాలని కోరుతూ ఆ మహిళ పిటిషన్ దాఖలు చేశారని అన్నారు. దీనిపై కోర్టు వెంటనే జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేయాలని లేదంటే ఆ వీర్యం శాంపుల్ వృథా అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దాంతో తన భర్త వీర్యంతో బిడ్డను కనాలనుకున్న ఆమె కోరిక తీరకుండా ఉంటుందని అర్జిత్ గౌర్ స్పష్టం చేశారు.

అలాగే పిటిషన్ లో ఆ మహిళ పేర్కొన్న వివరాల ప్రకారం.. ప్రస్తుతం తన భర్త ఉన్న కండీషన్ లో వీర్యం సేకరణ సురక్షితమా..? కాదా..? అని నిర్ధారించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని పిటిషనర్ ప్రతిపాదనలు చేశారు. అలాగే సర్జికల్‌ విధానంలో వీర్యాన్ని నేరుగా టెస్టికల్స్‌ నుంచి ఫైన్‌ నీడిల్ సాయం‌తో సేకరించాలని ఐవీఎఫ్‌ ఎక్స్‌ పర్ట్‌ డాక్టర్‌ శివాని సచ్‌ దేవ్‌ సూచనలు చేశారు. మైనస్ 196 డిగ్రీ సెల్సియస్ వద్ద ఈ వీర్యాన్ని చిన్న చిన్న వయాల్స్ లో భద్రపరచాలని అన్నారు. పేషంట్ కోమాలో ఉన్నప్పటికీ అతని వీర్యం క్వాలిటీలో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు.

Delhi High Court Petition Woman Seeks Access to Husband s Sperm While He is in Coma husband sperm

అయితే 2021 లో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. వీర్యాన్ని సేకరించేందుకు భార్యాభర్తల ఇద్దరి అనుమతి కావాల్సి ఉంటుంది. ముందస్తు ఆమోదం ఉంటే మరణించిన భర్త నుంచి కూడా వీర్యం సేకరించవచ్చు. కానీ ఈ కేసు ఆ రెండు విధానాలకు భిన్నమైనది కావడంతో క్లిష్ట తరంగా మారింది. ఇక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+