మీరు వాడే టూత్‌పేస్ట్ ఫేక్ ది అయ్యుండొచ్చు- ఒకసారి చెక్ చేసుకోండి

ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో నకిలీ 'క్లోజప్' టూత్‌పేస్ట్ తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న పెద్ద రాకెట్‌ను క్రైమ్ బ్రాంచ్ ఛేదించింది. ఈ ఆపరేషన్‌లో పెద్ద మొత్తంలో నకిలీ టూత్‌పేస్ట్ ట్యూబ్‌లు, ముడిసరుకును స్వాధీనం చేసుకుంది. ఈ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ వినియోగదారుల ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్న ఈ భారీ నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసులు గుట్టు రట్టు చేశారు.

దేశమంతా కూడా ఈ ముఠాకు నెట్ వర్క్ ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ కేంద్రంగా పలు రాష్ట్రాలకు ఈ నకిలీ టూత్ పేస్ట్ లను పంపించినట్లు గుర్తించారు. వీరి నెట్ వర్క్ ఎక్కడెక్కడ ఉందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తోన్నారు. వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. హిందూస్తాన్ లీవర్ల లిమిటెడ్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Delhi police busted a racket producing and distributing fake consumer good

హిందుస్థాన్ యూనీలివర్ (HUL) ప్రతినిధి నరేంద్ర సింగ్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తమ గ్రూప్ కంపెనీలకు చెందిన ప్రముఖ బ్రాండ్ 'క్లోజప్' పేరుతో నకిలీ టూత్‌పేస్ట్‌లు మార్కెట్‌లో విక్రయిస్తోన్నట్లు సమాచారం అందిందని, దీనిపై వెంటనే బురారీ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ఈ సమాచారం ఆధారంగా.. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందం బురారీలో దాడులు నిర్వహించింది.

అక్కడ ఓ గోడౌన్ లో భారీ మొత్తంలో స్టాక్ చేసి ఉంచిన నకిలీ టూత్‌పేస్ట్ ట్యూబ్‌లు, వాటి ఉత్పత్తికి ఉపయోగించే ముడిసరుకును సొంతం చేసుకున్నారు. దాదాపు 25,000 నకిలీ క్లోజప్ టూత్‌పేస్ట్ ట్యూబ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా నకిలీ పేస్ట్ తయారీకి ఉపయోగించే ముడిసరుకు, ప్యాకేజింగ్ మెటీరియల్, కొన్ని యంత్రాలు, ఇతర సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ రాకెట్ చాలా కాలంగా బురారీ కేంద్రంగా క్లోజప్ టూత్ పేస్ట్ ను తయారు చేసి విక్రయిస్తోన్నట్లు గుర్తించారు.

క్రైమ్ బ్రాంచ్ ఈ రాకెట్ ప్రధాన సూత్రధారిని అదుపులోకి తీసుకుంది. ప్రాథమిక విచారణలో ఈ ముఠా వ్యవస్థీకృతంగా పనిచేస్తూ నకిలీ ఉత్పత్తులను ఢిల్లీలోని వివిధ మార్కెట్లలో సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఇతర రాష్ట్రాలకు కూడా వీటిని సరఫరా చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నకిలీ వస్తువులు ఎక్కడెక్కడికి పంపిణీ అయ్యాయో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ రాకెట్ కు చెందిన ఇతర సభ్యులు, దాని నెట్‌వర్క్‌పై ఆరా తీస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+