Lover: ప్రియురాలిని పీస్ పీస్ చేసిన హఫ్తాబ్, సీసీటీవీల్లో ఉన్నది ఎవరు ?, 13 ముక్కలు !
న్యూఢిల్లీ/ముంబాయి: ప్రేమించిన యువతిని హత్య చేసిన ప్రియుడు ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. పోలీసుల విచారణలో ప్రియుడు దిమ్మతిరిగిపోయే విషయాలు చెబుతున్నాడు. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఫ్లాట్ వాటర్ బిట్ కట్టకపోవడంతో ప్రియుడు అడ్డంగా చిక్కిపోయాడు. అపార్ట్ మెంట్ లో పోలీసులకు సాక్షాలు చిక్కాయి. ప్రియుడికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించడాని పోలీసులకు ఇప్పటికే కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రియురాలిని హత్య చేసిన తరువాత ఓ బ్యాగ్ తగిలించుకున్న ప్రియుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెలుతున్న సీసీటీవీ క్లిప్పింగ్స్ పోలీసులకు చిక్కాయి. అయితే సీసీటీవీ కెమెరాల్లో హఫ్తాబ్ ముఖం స్పష్టంగా లేకపోవడంతో పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసుల సహాయం తీసుకుంటున్నారని తెలిసింది.

ప్రియురాలితో సహజీవనం
ముంబాయికి చెందిన శ్రద్దా (26) అనే యువతిని హఫ్తాబ్ అనే యువకుడు వలలో వేసుకున్నాడు. కుటుంబ సభ్యులను ఎదిరించిన శ్రద్దా ఆమె ప్రియుడు హఫ్తాబ్ తో ఢిల్లీ పారిపోయి అతనితో అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నది. చాలాకాలం పాటు ప్రియురాలు శ్రద్దాతో హఫ్తాబ్ ఎంజాయ్ చేశాడు. ఢిల్లీలో శ్రద్దా, హఫ్తాబ్ ఉద్యోగాలు చేశారు.

లవ్ జీహాద్ లో భాగం ?
పెళ్లి చేసుకుందామని శ్రద్దా ఆమె ప్రియుడు అఫ్తాబ్ మీద ఒత్తిడి చేసింది. అయితే శ్రద్దాను పెళ్లి చేసుకోవడం హఫ్తాబ్ కు ఏమాత్రం ఇష్టం లేదని సమాచారం. శ్రద్దా హిందూ అమ్మాయి కావడంతో పెళ్లి చేసుకోవడానికి హఫ్తాబ్ వెనకడుగు వేశాడు. ప్రియురాలు శ్రద్దా టార్చర్ ఎక్కువ కావడంతో కొన్ని నెలల క్రితం హఫ్తాబ్ ఆమెను అపార్ట్ మెంట్ లోనే దారుణంగా చంపేశాడు.

ప్రియుడి అరాచకం
శ్రద్దాను హత్య చేసిన హఫ్తాద్ ఆమె శవాన్ని 35 ముక్కలుగా నరికేశాడు. శ్రద్దా శరీరంలోని ముక్కలు ప్లాస్టిక్ కవర్లలో వేసి వాటిని ఫ్రిజ్ లో పెట్టాడు. తరువాత రోజుకు కొన్ని ముక్కలు బయటకు తీసుకెళ్లి ఎవరికి అనుమానం రాకుండా ఢిల్లీ సమీపంలోని అటవి ప్రాంతంలో ఆ ముక్కలు విసిరేసి చేతులు దులుపుకున్నాడు.

పోలీసుల చేతికి సీసీటీవీ క్లిప్పింగ్స్
శ్రద్దాను హత్య చేసిన తరువాత హఫ్తాబ్ అతను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ సమీపంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెలుతున్న సీసీటీవీ క్లిప్పింగ్స్ ను పోలీసులు సేకరించారు. వేకువ జామున 4 గంటల సమయంలో హఫ్తాబ్ బుజానికి బ్యాగ్ వేసుకుని చేతిలో బాక్స్ పట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెలుతున్న సమయంలో సీసీటీవీల్లో రికార్డు అయ్యింది.

బ్యాగ్ లో ఏముంది ?
శ్రద్దాను హత్య చేసిన తరువాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆ బ్యాగ్ లో తీసుకుని వెళ్లాడని పోలీసులు అంటున్నారు. సీసీటీవీ కెమెరాల్లో హఫ్తాబ్ ముఖం స్పష్టంగా లేకపోయినా అది అతనే అని పోలీసులు అంటున్నారు. ఆ సమయంలో రోడ్డు మీద ఒక్కరు కూడా సంచరించలేదని, హఫ్తాబ్ ఒక్కడే బ్యాగ్ తగిలించుకుని వెళ్లాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

13 ముక్కలు మాత్రమే చిక్కాయి
అటవి ప్రాంతంలో శ్రద్దా శరీరంలోని 13 ముక్కలు మాత్రమే చిక్కాయి. మిగిలిన శరీరంలోని ముక్కలు కుక్కలు తినేసి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్ మెంట్ లో పోలీసులకు సాక్షాలు చిక్కాయి. ప్రియుడికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించడాని పోలీసులకు ఇప్పటికే కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రియురాలిని హత్య చేసిన తరువాత ఓ బ్యాగ్ తగిలించుకున్న ప్రియుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెలుతున్న సీసీటీవీ క్లిప్పింగ్స్ పోలీసులకు చిక్కాయి.












Click it and Unblock the Notifications