తన బోయ్ ప్రెండ్ పై మోజుపడిందని, అక్కను చంపింది, పోకిరి చంపాడని చివరికి పోలీసులకు చిక్కింది
తన బోయ్ ప్రెండ్ పై మోజుపడిందని స్వంత అక్కను డిల్లీలో ఓ యువతి చంపింది. పోకిరి ఆమె వేధిస్తున్నాడని నమ్మించేందుకు ప్రయత్నించి విఫలమైంది.బోయ్ ప్రెండ్ సహకారంతోనే అక్కను ఆమె చంపింది.
న్యూఢిల్లీ : ప్రియుడిపై తన అక్క మోజు పడుతోందనే అనుమానంతో స్వంత చెల్లెలే ఆమెను అత్యంత దారుణంగా హతమార్చింది. ఈ ఘటన డిల్లీలో చోటుచేసుకొంది.ఈ హత్యను తనపై రాకుండా పకడ్బందీగా ప్లాన్ వేసి తప్పించుకోవాలని చూసింది. చివరకు జైలు ఊచలు లెక్కిస్తోంది చెల్లెలు.
ఈ నెల 14వ, తేదిన నార్త్ ఈస్ట్ డిల్లీలోని శాస్త్రి పార్క్ లో మృతదేహం దొరికింది. ఈ మృతదేహనికి పాయింట్ బ్లాంక్ లో తుపాకీతో కాల్చడం వల్ల చనిపోయిందని పోలీసులు గుర్తించారు. చనిపోయిన యువతిని 24 ఏళ్ళ సోనమ్ గా గుర్తించారు.ఆమెను ఆమె సోదరి షాజియా తుపాకీతో కాల్చిచంపింది.

బాయ్ ప్రెండ్ సహకారంతో హత్య
బాయ్ ఫ్రెండ్ వసీమ్ సహకారంతో సోనమ్ ను షాజియా హత్య చేసింది.అయితే ఈ కేసును తప్పుదోవపట్టించేందుకుగాను తన సోదరిని పోకిరి వేధిస్తున్నాడని , అతనే ఆమెను హత్య చేసి ఉంటాడనే కట్టుకథను అల్లింది.ఈ దిశగా పోలీసులు విచారణ ప్రారంభించారు . అయితే ఎలాంటి పురోగతి లేకుండా పోయింది.
వసీమ్ తన ప్రేమ వ్యవహరాన్ని ఇంట్లో చెబుతోందనే కారణం కూడ షాజీయా అనుమానించింది. మరో వైప తన బోయ్ ప్రెండ్ తో తన సోదరి చనువగా ఉండడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. దీంతో సోదరిని హత్య చేయాలని నిర్ణయం తీసుకొంది. దరిమిలా బోయ్ ప్రెండ్ సహకారంతో తన సోదరి సోనమ్ ను హత్య చేసింది.
బోయ్ ప్రెండ్ తో పాటు మరోక వ్యక్తి సోనమ్ హత్యకు సహకరించారు. షాజియా ఆమె బోయ్ ప్రెండ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయాలు వెలుగుచూశాయి.












Click it and Unblock the Notifications