ఐటీ హబ్ లో చాపకింద నీరులా డెంగ్యూ కేసులు, వేలల్లో నమోదు అవుతున్న కేసులు !
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) అధికారుల డేటా ప్రకారం ఈ సంవత్సరం బెంగళూరులో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో 4,,323 డెంగ్యూ కేసులు నమోదైనట్లు బీబీఎంపీ అధికారులు అంటున్నారు. గత జూన్‌లో 689 డెంగ్యూ కేసులు నమోదు కాగా, జులైలో 1,629 కేసులు, ఆగస్టులో డెంగ్యూ కేసుల సంఖ్య 1,589కి పెరిగిందని అధికారులు అంటున్నారు.
సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు బెంగళూరు సిటీ కార్పొరేషన్ ద్వారా 416 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. బీబీఎంపీ అధికారుల నివేదిక ప్రకారం 2019లో 44, 863 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి, ఇది 2020 నాటికి 6 ,679 కేసులు, అదేవిధంగా 2021లో 6,166 కేసులు, 2022లో 5,589 కేసులు నమోదయ్యాయి.

జనవరి నుంచి సెప్టెంబర్ 12 వరకు దక్షిణ కన్నడ జిల్లాలో 198 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అయితే జ్వరం కారణంగా మరణించిన కేసును ఆరోగ్య అధికారులు ధృవీకరించలేదు. కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ వర్షాకాలంలో ఎక్కడంటే అక్కడ నీరు నిలిచి దోమలకు నిలయంగా మారడంతో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయన్నారు.
డెంగ్యూ వ్యాధి వ్యాపించకుండా మీరు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి దినేష్ గుండూరావ్ ఆదేశించారు. ఈ నెల ప్రారంభంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నగరంలో నీరు ఎక్కడంటే అక్కడ నిలిచిపోకుండా చూడాలని బీబీఎంపీ అధికారులు, బెంగళూరు జలమండలి అధికారులను ఆదేశించారని మంత్రి దినేష్ గుండూరావ్ గుర్తు చేశారు.
ఇలా జరిగితే దోమల ఉత్పత్తి కేంద్రంగా మారుతుందని కర్ణాటక ప్రభుత్వం అంటోంది. ప్రజలు కూడా డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి దినేష్ గుండూరావ్ మనవి చేశారు. ఇంటి చుట్టూ నీరు నిలువకుండా చూడాలని, దోమలు కుట్టకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో దోమతెరతో మనకు మనం రక్షణ కల్పించుకోవాలని, పగటిపూట దోమల బెడదపై మరింత అవగాహన కల్పించాలని మంత్రి దినేష్ గుండూరావ్ ప్రజలకు మనవి చేశారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications