వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Dera Baba: డేరాబాబాకు చీటీ చినిగిపోయింది, హత్య కేసులో దోషి, గతంలో అత్యాచారం కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష !

|
Google Oneindia TeluguNews

పంచకుల/ హర్యానా/ పంజాబ్: తనకు తాను దేవుడు (Self-styled godman) అని ప్రకటించుకుని పాటుపడిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను మరిచిపోవడం చాలా కష్టం, దత్తపుత్రికతో రాసలీలలు సాగించాడని ఆయనగారి మీద ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే అత్యాచారం, హత్య కేసుల్లో 20 సంవత్సరాలు జైలు శిక్షకు గురైప గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు మరో ఎదురు దెబ్బ తిగిలింది. రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తో పాటు మరో ఐదు మంది నేరం చేశారని కోర్టులో నేరం రుజువు అయ్యింది. గుర్మీత్ రామ్ రమీమ్ సింగ్ కు మరో కేసులో ఎదురు దెబ్బ తగలడంతో ఆయన అనుచరులు షాక్ అయ్యారు. డేరా సచ్చా సౌదా చీఫ్ ముసుగులో అనేక అరచకాలు చేసిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు రోజులు దగ్గరపడిపోయాయని ఆయన బాధితులు అంటున్నారు.

Lady: నాకు స్వర్గం చూపించు, నీకు సినిమా చూపిస్తా, సీసీటీవీల్లో పొలిటికల్ లీడర్ కర్మకాండ, నలిపేసి లాస్ట్ కు !Lady: నాకు స్వర్గం చూపించు, నీకు సినిమా చూపిస్తా, సీసీటీవీల్లో పొలిటికల్ లీడర్ కర్మకాండ, నలిపేసి లాస్ట్ కు !

 జీన్స్ ప్యాంట్ లు, నీ షర్టులు, నల్ల అద్దాలు

జీన్స్ ప్యాంట్ లు, నీ షర్టులు, నల్ల అద్దాలు

హర్యానాలోని పంచకులో డేరా సచ్చా సౌదా పేరుతో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గతంలో ఆశ్రమాలు నిర్వహించాడు. తనకు తాను దేవుడు (Self-styled godman) అని ప్రకటించుకున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అందరి బాబాల కంటే ప్రత్యేకతను చాటుకున్నాడు. జీన్స్ ప్యాంట్ లు, టీ షర్టులు. నల్ల అద్దాలు (కూలింగ్ గ్లాస్) తో పాటు రంగురంగు దుస్తులు వేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఫ్లాష్ బ్యాక్ లో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబాకు లక్షలాది మంది భక్తులతో పాటు అనుచరులు ఉన్నారు.

 వీర లెవల్లో పాటుపడిన డేరాబాబా, హీరోగా సినిమాలు

వీర లెవల్లో పాటుపడిన డేరాబాబా, హీరోగా సినిమాలు

ఫ్లాష్ బ్యాక్ లో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబాకు లక్షలాది మంది భక్తులతో పాటు అనుచరులు ఉన్నారు. గుర్మీత్ సింగ్ రామా్ రహీమ్ సింగ్ బాబా హీరోగా కొన్ని సినిమాలు తీసి ఆయన భక్తులను చూడమని చెప్పి వీరలెవల్లో పాటుపడ్డాడు. చేసుకున్న పాపం ఊరికే పోదు అనే టైపులో తరువాత గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్ పింగ్ బాబాకు నిజంగానే సినిమా కష్టాలు ఎదురైనాయి.

 రెండు రేప్ కేసులు, హత్య కేసుల్లో 20 ఏళ్లు జైలు శిక్ష

రెండు రేప్ కేసులు, హత్య కేసుల్లో 20 ఏళ్లు జైలు శిక్ష

తన ఆశ్రమానికి వచ్చి వెలుతున్న ఇద్దరు మహిళల మీద వివాదాస్పద మత గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా అత్యాచారం చేశాడని, హత్యలు చేశాడని 2017లో సీబీఐ కోర్టు నిర్దారించింది. దోషిగా తేలిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబాకు సీబీఐ ప్రత్యేక కోర్టు గతంలో 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం దొంగ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

 ఐదు మంది దారుణ హత్య

ఐదు మంది దారుణ హత్య

డేరా సచ్చా సౌదా పేరుతో అరాచకాలు చేస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మీద అతని ఆశ్రమానికి వచ్చి వెలుతున్న రంజిత్ సింగ్ తో పాటు మరి కొందురు ఎదురుతిరిగారు. 2002 జులై 10వ తేదీన రంజిత్ సింగ్ తో పాటు ఐదు మందిని డేరా సచ్చా సౌద చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దారుణంగా కాల్చి చంపించారని కేసు నమోదు అయ్యింది.

 రంజిత్ సింగ్ ను డేరాబాబా చంపించాడు

రంజిత్ సింగ్ ను డేరాబాబా చంపించాడు

గతంలో తన మద్దతుదారుడైన రంజిత్ సింగ్ తదితరులను హత్య చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్ బాబాకు వ్యతిరేకంగా కోర్టులో బలమైన సాక్షాలను పోలీసులు సమర్పించారు. రంజిత్ సింగ్ తదితరుల హత్య కేసులో గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్ సింగ్ తో పాటు మరో ఐదు మంది నేరం చేశారని రుజువు అయ్యిందని శుక్రవారం పంచకులోని ప్రత్యేక కోర్టు చెప్పింది. రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్ తో పాటు మరో ఐదు మందికి అక్టోబర్ 12వ తేదీన పంచకుల ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చెయ్యనుంది.

Recommended Video

TOP NEWS : Congo | Etala Rajender | JP Nadda | Delta Variant
 జర్నలిస్టు హత్య కేసులో జైలు శిక్ష

జర్నలిస్టు హత్య కేసులో జైలు శిక్ష

2019 జనవరిలో ఒక జర్నలిస్టును హత్య చేయించాడని గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మీద ఇప్పటికే నేరం రుజువు కావడంతో జైలు శిక్షపడింది. ప్రపంచానికి దత్త పుత్రికగా పరిచయం చేసిన ఓ యువతితో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా డేటింగ్ చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఆమెతో కలిసి గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్ సింగ్ సినిమాలు కూడా తీసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

English summary
Dera Baba: Self-styled godman Gurmeet Ram Rahim Singh and five other accused have been convicted in the Ranjit Singh murder case. Ranjit Singh, who was murdered on July 10, 2002,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X