వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరా బాబాకు మరోసారి అనారోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

|
Google Oneindia TeluguNews

డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో జైలు అధికారులు ఆయనను రోహ్‌తక్‌లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం సునేరియా జైల్లో శిక్ష అనుభవిస్తున్న డేరాబాబాను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించేందుకు భారీ పోలీస్‌ భద్రత ఏర్పాటు చేశారు. వైద్యులు ఆయనకు సీటీ స్కాన్ సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.

అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ మళ్లీ తిరిగి జైలుకు తరలించారు. తన ఆశ్రమంలోని ఇద్దరు సాద్విల‌పై డేరా బాబా అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో 2017 ఆగస్టులో సీబీఐ కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అప్పటి నుంచి ఆయన రోహ్‌తక్‌లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు.

dera baba health condition is little critical

అత్యాచార అభియోగాలు నిరూపితం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రోహతక్ లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తుండగా.. రక్తపోటు, నీరసం వంటి సమస్యలతో కొన్నివారాల కిందట చండీగఢ్ లోని పీజీఐఎంఎస్ ఆసుపత్రిలో డేరా బాబా చికిత్స పొందారు.

ఇప్పుడు కడుపు నొప్పి రావడంతో ఇదే ఆసుపత్రికి తీసుకువచ్చారు. పొట్టభాగానికి సీటీ స్కాన్ చేయించారు. ఇతర వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి సునారియా జైలుకు తరలించారు. 17 ఏళ్ల కిందట ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా బాబాపై అభియోగాలు నిరూపితం అయిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్ల నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.

డేరా బాబా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రత్యేకంగా డేరా సచ్చా సౌదా పేరిట మతం ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆశ్రమాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ గతంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. డేరా బాబా ఆధ్యాత్మిక రంగంలోనే కాదు, సినిమాలు, సంగీతంలోనూ తన మార్కు చూపించారు. గతంలో తానే హీరోగా సినిమా నిర్మాణం, తన సంగీత ప్రతిభను చాటేలా సొంత ఆల్బంలు రూపొందించారు.

English summary
dera baba health condition is little critical, jail official move to rohtal pgims hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X