తవ్వుతున్న కొద్దీ డేరా బాబా చీకటి కోణాలు: రాసలీలల కోసం సొరంగం

Posted By:
Subscribe to Oneindia Telugu

చండీగఢ్: డేరా సచ్చా సౌదా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు చెందిన చీకటి కోణాలు తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్నాయి. సిర్సాలో ఆదివారం కూడా సోదాలు నిర్వహించారు.

ఇప్పటికే కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు సొంతం చేసుకున్నారు. ఈ రోజు మరిన్ని కీలక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు.

రాత్రిపూట గుర్మీత్ రాసలీలలు

రాత్రిపూట గుర్మీత్ రాసలీలలు

గుర్మీత్ సింగ్ బాబు ఆశ్రమంలో అంతా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. కానీ రాత్రయ్యేసరికి మొత్తం మారిపోతుంది. బాబాలోను రెండో కోణం బయటకు వస్తుంది. పగటిపూట శిష్యురాళ్లుగా ఉండేవారంతా రాత్రిపూట ఇంకో అవతారంలోకి మారిపోతారు. ఆధ్యాత్మిక గురువు కాస్తా రాసలీలలు జరుపుతాడు.

రాసలీలల కోసం సొరంగం

రాసలీలల కోసం సొరంగం

రాసలీలల కోసం గుర్మీత్ ఓ సొరంగాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యురాళ్లపై అత్యాచారాలకు పాల్పడి ప్రస్తుతం కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్న గుర్మీత్ కామక్రీడలు, ఇతరత్రా నేర సామ్రాజ్య తీరుతెన్నులు చూసి దర్యాప్తు అధికారులే నిర్ఘాంతపోతున్నారు.

సొరంగాలు ఇలా... ఫైబర్‌తో

సొరంగాలు ఇలా... ఫైబర్‌తో

సిర్సాలో ఉన్న సచ్చా సౌదా కేంద్ర ప్రాంగణంలో భారీ ఎత్తున సోదాలు జరుపుతున్న అధికారులు.. సొరంగ మార్గాలను గుర్తించారు. గుర్మీత్‌ వ్యక్తిగత నివాసం నుంచి శిష్యురాళ్ల నివాసాలుండే సాధ్వీ నివాస్‌‌కు రాకపోకలకు వీలుగా ఫైబర్‌ సొరంగం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ గుహలోనే గుర్మీత్‌ మహిళలపై ఆకృత్యాలకు ఒడిగట్టేవాడని ఆరోపణలున్నాయి.

మరో సొరంగం కూడా

మరో సొరంగం కూడా

ఫైబర్‌తో రూపొందించిన మరో గుహనూ గుర్తించారు. దానిని మట్టితో కప్పిపెట్టారు. గుర్మీత్‌ నివాసంలోకి అత్యంత సన్నిహిత అనుచరులు మినహా వేరెవరికీ ప్రవేశం ఉండేది కాదు. 800 ఎకరాల్లో విస్తరించి ఉన్న డేరా లోపల.. పేలుడు పదార్థాలు, బాణాసంచా తయారీ కోసం ఏర్పాటు చేసుకున్న అక్రమ కర్మాగారం కూడా బయటపడ్డాయి. రసాయన పదార్థాలనూ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

సోదాలను వీడియో తీస్తున్నారు

సోదాలను వీడియో తీస్తున్నారు

ఏకే 47 తూటాలకు సంబంధించిన ఓ ఖాళీ అర కూడా లభించినట్లు అధికారులు తెలిపారు. సోదాలు మొదలైన మొదటి రోజే సంఖ్యాఫలకం లేని విలాసవంతమైన కారు, టీవీ ప్రసారాలకు వినియోగించే వాహనం, వాకీటాకీలు, రద్దయిన నోట్లు, ప్లాస్టిక్‌ నగదు బయటపడిన విషయం తెలిసిందే. రెండో రోజైన శనివారం వెలుగుచూసిన సొరంగంపై ఫోరెన్సిక్‌ నిపుణులు దృష్టి సారించారు. కొన్ని గదులను సీజ్‌చేయడంతో పాటు హార్డ్‌డిస్కులు, వివరాల్లేని మందుల్ని స్వాధీనం చేసుకున్నారు. సోదాల ప్రక్రియను వీడియో తీస్తున్నారు.

14 మృతదేహాల అప్పగింత

14 మృతదేహాల అప్పగింత

డేరా తరఫున ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్ మధ్య 14 మృతదేహాలను లక్నోలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి అప్పగించారు. ఇది ఇప్పుడు కలకలం రేపుతోంది. మృతదేహాలను అప్పగించడానికి అనుసరించాల్సిన పద్ధతులను పాటించకపోవడంతో అసలు ఇవి ఎవరివనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటిలో దేనికీ పోలీసు అనుమతులు, మరణ ధ్రువీకరణ పత్రాలూ లేవని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

హత్యలు జరిగేవనే ఆరోపణలకు బలం

హత్యలు జరిగేవనే ఆరోపణలకు బలం

ఆశ్రమంలో గుట్టుచప్పుడు కాకుండా హత్యలూ జరిగేవన్న ఆరోపణలకు ఈ మృతదేహాల అఫ్పగింత బలం చేకూరుస్తోంది. మృతదేహాల వల్ల నదులు కలుషితం కాకుండా చూడడానికి తమ సభ్యులు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం మేరకే వైద్య కళాశాలకు వాటిని దానం చేసినట్లు డేరా వర్గాలు చెబుతున్న మాటల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను స్వీకరించిన కళాశాల నుంచి సంజాయషీ కోరారు.

విలాస పురుషుడు గుర్మీత్

విలాస పురుషుడు గుర్మీత్

అనేక రకాల అభిరుచులు, అలవాట్లు ఉన్న డేరా బాబా ఎంతో విలాస పురుషుడు అని అర్థమవుతోంది. సోదాల్లో వందకొద్దీ బూట్లు, డిజైనర్‌ వస్త్రాలు బయటపడ్డాయి. కొన్ని సినిమాల్లోనూ నటించిన బాబా వద్ద ఉన్న టోపీలకైతే లెక్కేలేదు. డేరా లోపల ఉన్న దుకాణాల్లో రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఎంఎస్‌జీ పేరుతో వినియోగవస్తువులు కనిపిస్తున్నాయి. డేరాలోపల నివాసాలు, పాఠశాలలు, క్రీడా గ్రామం, ఆసుపత్రి, వాణిజ్య సముదాయాలు, చలనచిత్ర మందిరంతో పాటు అత్యంత వైభవోపేతమైన ఏడు నక్షత్రాల రిసార్టు సైతం ఉంది. దీనిలో ఈఫిల్‌ టవర్‌, తాజ్‌ మహల్‌, క్రెమ్లిన్‌, డిస్నీ వరల్డ్‌ తదితరాల నమూనాలూ కొలువుతీరాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An illegal explosives factory has been found inside the headquarter of the Dera Sacha Sauda premises in Sirsa, after forces continued search operation for the second day on Saturday. The factory has already been sealed. Information and Public Relations Deputy Director, Satish Mehra, said a window-like path leading from Dera Awas to Sadhvi Niwas has been found.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి