ఎంతటోళ్లయినా శిరస్సు వంచాల్సిందే: ఆ ఛరిష్మా అలాంటిది- అదే హైలైట్
New Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ బాధ్యతలను అందుకోవడం ఆయనకు ఇది మూడోసారి. తొలి విడతలో పూర్తికాలం పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. రెండో విడతలో అయిదు రోజులు మాత్రమే ఈ హోదాలో కొనసాగారు.
ఇప్పుడు మూడోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. మహాయుటి కూటమి నేతలు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ముంబై ఆజాద్ మైదాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), భజన్ లాల్ శర్మ (రాజస్థాన్), మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్), విష్ణు దేవ్ సాయ్ (ఛత్తీస్‌గఢ్), ప్రమోద్ సావంత్ (గోవా), హిమంత బిశ్వ శర్మ (అస్సాం), మోహన్ చరణ్ మాఝీ (ఒడిశా), భూపేంద్ర పటేల్ (గుజరాత్), చంద్రబాబు నాయుడు (ఏపీ), నితీష్ కుమార్ (బిహార్), పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దేవేంద్ర ఫడ్నవిస్‌ను తొలుత గవర్నర్ పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందించారు. అనంతరం ఫడ్నవిస్ నేరుగా మోదీ వద్దకు వెళ్లారు. శిరస్సు వంచి పాదనమస్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు మోదీ. చిరునవ్వుతో భుజం తట్టారు.
ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తరలివచ్చింది. స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు, దేశీయ దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, రష్మిక మందన్న, శ్రద్ధ కపూర్.. ఇలా పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు తళుక్కుమంటూ మెరిశారు.
షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. సంజయ్ దత్ పక్కనే కూర్చున్నారు సల్మాన్ ఖాన్. టీమిండియా మాజీ కేప్టెన్ సచిన్ టెండుల్కర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ సహా పలువురు పారిశ్రామికవేత్తలు ప్రమాణ స్వీకారోత్సవంలో కనిపించారు.
#WATCH | Mumbai: Devendra Fadnavis meets Maharashtra Governor CP Radhakrishnan and Prime Minister Narendra Modi after taking oath as Chief Minister of Maharashtra pic.twitter.com/jsMFDrOuzO
— ANI (@ANI) December 5, 2024












Click it and Unblock the Notifications