మనుషుల తరహలోనే వారికి ఇబ్బందులు, శీతాకాలంలో పట్టుకు బదులు ఉన్ని వస్త్రాలు
మనుషులే కాదు దేవత విగ్రహాలకు చలివేస్తోంది. శీతాకాలంలో చలికి తట్టుకోవడానికి మనం ఏ రకంగా ఉన్ని దుస్తులు వాడుతామో, అదే తరహాలో దేవత విగ్రహాలకు కూడ ఉన్ని దుస్తులను కప్పుతున్నారు. మనుషుల తరహాలోనే దేవత
ఉత్తర్ ప్రదేశ్ :మనుషులే కాదు దేవత విగ్రహాలకు చలివేస్తోంది. శీతాకాలంలో చలికి తట్టుకోవడానికి మనం ఏ రకంగా ఉన్ని దుస్తులు వాడుతామో, అదే తరహాలో దేవత విగ్రహాలకు కూడ ఉన్ని దుస్తులను కప్పుతున్నారు. మనుషుల తరహాలోనే దేవత విగ్రహాలకు కూడ దుప్పట్లను కప్పుతున్నారు.
ఉత్తర భారతదేశంలో చలికాలం విపరీతమైన చలి ఉంటుంది. దీని కారణంగా ఇంటి నుండి బయటకు వెళ్ళేందుకు జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు.అత్యవసరమైతే తప్పా జనం బయటకు వెళ్ళరు.అయితే ఈ చలి నుండి రక్షించుకొనేందుకు జనాలు మాత్రం ఉన్నిదుస్తులను వేసుకొంటుంటారు.

మనుషులే కాదు దేవతా విగ్రహాలకు కూడ ఉన్ని దుస్తులను, బ్లాంకెట్లను ఉన్ని వస్త్రాలను కప్పుతున్నారు.ఉత్తర్ ప్రదేశ్ లోని పలు ఆలయాల్లోని దేవతా విగ్రహాలకు ఉన్ని దుస్తులను, బ్లాంకెట్లను, దుప్పట్లను కప్పుతున్నారు.
చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని దేవాలయాల్లో నిర్వహించే కార్యక్రమాలకు పట్టు వస్త్రాలకు బదులుగా ఉన్ని వస్త్రాలను భక్తులు సమర్పిస్తున్నారు. శీతల గాలుల ప్రభావంతో దేవాలయాలను ఆలస్యంగా తెరుస్తున్నారు. సాయంత్రం పూట త్వరగా ముసివేస్తున్నారు. చలి కాలంలో సాయంత్రం పూట చలి ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున దేవాలయాలను త్వరగా మూసివేస్తున్నారు.












Click it and Unblock the Notifications