ఈ యాప్‌తో కేవలం 10 నిమిషాల్లోనే విమానం ఎక్కేయొచ్చు..!
హైదరాబాద్ : సాధారణంగా విమానాశ్రయాల్లో విమానం ఎక్కే ముందు ఎన్నో తనిఖీలు ఉంటాయి. లగేజ్ దగ్గర నుంచి టికెట్ వరకు. ఇందుకోసం పెద్ద క్యూలైనే ఉంటుంది. అయితే ఇప్పుడు విమానం ఎక్కాలంటే చాలా సింపుల్. ఈ క్యూలైన్లు ఇవన్నీ లేకుండా చాలా వేగంగా కూడా అన్ని ఫార్మాలటీలు పూర్తవుతాయి. అయితే ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్‌లో ఒక యాప్‌ను ఇన్స్‌టాల్ చేసుకోవడమే. ఇంతకీ ఆ యాప్ ఏంటో తెలుసా..?
విమాన ప్రయాణం అనగానే రెండు గంటల ముందే ఏర్పోర్ట్‌కు చేరుకుని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం క్యూలైన్లలో నిలబడితే సిబ్బంది వచ్చి లగేజ్, టికెట్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఇదంతా క్షణాల్లో అయిపోవలంటే భారత ప్రభుత్వం ఒక యాప్‌ను విడుదల చేసింది. దీనిపేరు డిజియాత్ర యాప్ (Digiyatra APP). చివరి నిమిషంలో విమానం క్యాచ్ చేయడం,పెద్ద క్యూలైన్లలో నిలబడటం వంటి వాటికి ఈ యాప్ పరిష్కారం చూపుతుంది. ఎలానో తెలుసుకుందాం.

ఇక విమానం ఎక్కే ముందు పూర్తికావాల్సిన లాంఛనాలు గంటల సమయం తీసుకుంటుంది. ఇప్పుడు డిజి యాత్ర యాప్‌తో అది కేవలం 10 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా డిజియాత్ర యాప్‌ను మీ స్మార్ట్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ కార్డ్‌ను,ఫేస్‌ఐడీని అప్‌లోడ్ చేయాలి. తర్వాత బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేయాలి. ఇదంతా అయ్యాక ఏర్పోర్ట్‌లో ప్రత్యేకంగా ఉంచిన డిజియాత్ర యాప్ కౌంటర్ దగ్గరకు వెళ్లి మీ బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేస్తే చాలు. ఇందుకు 3 నిమిషాల సమయం పడుతుంది.













Click it and Unblock the Notifications