రంగంలోకి దిగ్గీ రాజా: రాజగోపాల్‌కు ఫోన్, ఢిల్లీ రావాలని ఆహ్వానం.. అయినా
టీ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ హాట్ టాపిక్ అవుతుంది. బీజేపీలో చేరతారనే ఊహాగానాలు నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. మొన్న భట్టి విక్రమార్క వెళ్లి చర్చలు జరిపారు. ఆ మరునాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యుహాకర్త సునీల్ కూడా చర్చలు జరిపారు. అయినా నో యూజ్.. ఇవాళ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. సమస్య ఉంటే.. మాట్లాడుకుందాం అని, పార్టీని వీడొద్దని కోరుతున్నారు. ఈ మేరకు ఆయన ఫోన్ చేశారు.

రంగంలోకి దిగ్గీరాజా
రాజగోపాల్ రెడ్డి డిమాండ్ల గురించి దిగ్గీ రాజా అడిగారు. కానీ హస్తిన వెళ్లేందుకు రాజగోపాల్ రెడ్డి సుముఖంగా లేరని తెలుస్తోంది. నిన్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జీ కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ కాంగ్రెన్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణికం ఠాగూర్ సమావేశంలో పాల్గొన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకుండా ఉండేందుకు చేయాల్సిన అంశాలపై మాట్లాడారు.

పార్టీలో అవమానం
పార్టీలో తనకు అవమానం జరిగిందని రాజగోపాల్ రెడ్డి అంటున్నారట. ఇదే విషయాన్ని భట్టి విక్రమార్కకు తెలియజేశారని సమాచారం. పార్టీలో పదవీ గురించి కూడా దిగ్విజయ్ సింగ్ చర్చించనున్నారు. మరోవైపు పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవీకి రాజీనామాకు సంబంధించి అనుచరులతో రాజగోపాల్ రెడ్డి చర్చిస్తున్నారు. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌తో రాజగోపాల్ రెడ్డి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

మొదటినుంచి ఉన్నవారికి నో
ఎన్నికలకు సమయం ఉంది. అయినప్పటికీ వెళ్లే నేతలు అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలను పోగోట్టుకోవాలని అనుకోవడం లేదు. అందుకోసమే రాజగోపాల్ రెడ్డి గురించి చర్చలు జరుపుతుంది. ఆయన మాత్రం.. రేవంత్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యం లభించడం లేదని అంటున్నారు. తాను కూడా సీఎల్పీ పోస్టు ఆశించానని.. చివరికి భట్టికి ఇవ్వాలని చెప్పిందే తాను అని వివరించారు. ఉద్యమ సమయం నుంచి ఉన్నవారికి పార్టీలో గౌరవం లేదని.. అందుకే తాను పార్టీ మార్పు గురించి ఆలోచిస్తున్నాననే సంకేతాలను ఇచ్చారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications