ఆ సీడీ ఇస్తే ఆ స్వరనమూనాలు ఇచ్చే విషయమై ఆలోచిస్తా:దినకరన్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఆడియో రికార్డింగ్స్ సీడీ కాపీ ఇవ్వాలని ప్రత్యేక కోర్టుకు అన్నాడిఎంకె నుండి బహిష్కరణకు గురైన టీటీవి దినకరన్ మొరపెట్టుకొన్నారు.

దినకరన్ స్వర నమూనా సేకరించేందుకుగాను అనుమతివ్వాలని కోర్టును ఢిల్లీ పోలీసులు కోరిన నేపథ్యంలో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

సుకేష్ చంద్రశేఖర్ తో పాటు ఇతరులతో దినకరన్ టెలిపోన్ లో జరిపిన సంభాషణలకు సంబందించిన సీడీ నకలును ఇప్పించాలని ఆయన తరపు న్యాయవాది ప్రత్యేక కోర్టు జడ్జి పూనమ్ చౌదరిని కోరారు. స్వరనమూనా ఇవ్వాలా లేదా అనేది సీడీ పరిశీలించిన తర్వాత చెబుతామని దినకరన్ నిర్ణయం తీసుకొంటారని కోర్టుకు ఆయన తరపు లాయర్ తెలిపారు.

 Dinakaran seeks CD of his audio recordings

స్వరనమూనా తిరస్కరించే హక్కు నిందితులకు ఉందని సుప్రీంకోర్టు , హైకోర్టు తీర్పులున్నాయి. దినకరన్, చంద్రశేఖర్ ల స్వర నమూనాలు సేకరించేందుకు అనుమతివ్వాలని ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 18న, కోర్టు విచారించనుంది.

మల్లిఖార్జున బెయిల్ పిటిషన్ కూడ అదే రోజు విచారణకు రానుంది. కాగా, దినకరన్ ఆయన సన్నిహితుడు మల్లిఖార్జున, హావాలా ఆపరేటర్ నాథూసింగ్ లను వీడియో కాన్పరెన్స్ ద్వారా విచరించారు. వీరికి విధించిన జ్యూడిషీయల్ కస్టడీని ఈ నెల 29వ, తేదివరకు పొడిగించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADMK faction leader TTV Dinakaran on Monday sought in a special court the copy of a CD which allegedly has audio recordings of phone conversations between him and a co-accused in the Election Commission bribery case. The response of Dinakaran, who is in judicial custody, came on the Delhi Police’s plea seeking his consent for taking the voice samples.
Please Wait while comments are loading...