తండ్రి డర్టీ వీడియో.. కూతురు బంగారం స్మగ్లింగ్: పోలీస్ బాస్ ఇంట్లో అదిరిపోయే ట్విస్టులు!

కర్ణాటక పోలీస్ శాఖలో పెను కలకలం రేగుతోంది. ఆ రాష్ట్ర డీజీపీ రామచంద్రరావుకు సంబంధించిన ఓ అశ్లీల వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఈ ఘటనతో పాటు ఆయన కూతురు, కన్నడ నటి రన్యా రావు గతంలో చేసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

డీజీపీ సస్పెన్షన్.. అసలేం జరిగిందంటే?
కర్ణాటక డీజీపీ రామచంద్ర రావు మహిళలతో అభ్యంతరకరంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉన్నత పదవిలో ఉండి ఇటువంటి చర్యలకు పాల్పడటంపై తీవ్ర విమర్శలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఈ వివాదం ఓ వైపు ఉంటే, ఆయన కుమార్తె రాన్యా రావు ఇప్పటికే జైలులో శిక్ష అనుభవిస్తుండటం గమనార్హం.

Dirty Video Scandal and Gold Smuggling Case Karnataka DGP Ramachandra Rao Family Controversy

14 కిలోల బంగారం.. 102 కోట్ల జరిమానా ట
కన్నడ సూపర్ స్టార్ సుదీప్ సరసన 'మాణిక్య' చిత్రంలో నటించిన రాన్యా రావు, గతేడాది భారీ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పట్టుబడ్డారు. 2025 మార్చి 3న దుబాయ్ నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన రన్యా రావు వద్ద 14.8 కిలోల బంగారం బయటపడింది. ఆమె ఒంటిపై కిలోల కొద్దీ నగలు ధరించడంతో పాటు, దుస్తుల లోపల 17 బంగారు బిస్కెట్లను దాచి తరలించే ప్రయత్నం చేసింది. అనంతరం డీఆర్ఐ (DRI) ఆమె ఇంట్లో జరిపిన సోదాల్లో 2.5 కోట్ల నగదు, 2 కోట్ల విలువైన నగలు లభ్యమయ్యాయి. దీనిపై ఈడీ (ED) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి 34 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఈ కేసులో రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష పడటంతో ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. డీఆర్ఐ ఆమెపై ఏకంగా 102 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది.

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని..
రన్యా రావు కేవలం ఒకేసారి కాకుండా ఏడాది కాలంలో సుమారు 30 సార్లు దుబాయ్ వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అరెస్ట్ కావడానికి ముందు 15 రోజుల్లోనే నాలుగు సార్లు విదేశీ ప్రయాణాలు చేసింది. స్మగ్లింగ్ చేసిన బంగారంతో ఎయిర్‌పోర్టులో దిగగానే, తను ఐపీఎస్ (DGP) కూతురినని చెప్పుకుని, స్థానిక పోలీసులను పిలిపించుకుని వారి రక్షణలో క్షేమంగా ఇంటికి చేరుకునేదని సమాచారం. తండ్రి హోదాను అడ్డం పెట్టుకుని అధికారులను తప్పుదోవ పట్టించి ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. రామచంద్ర రావు రన్యా రావుకు సవతి తండ్రి అయినప్పటికీ.. ఆమె తన ప్రయాణాల్లో ఆయన పేరును విరివిగా ఉపయోగించుకున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇప్పుడు తండ్రి అశ్లీల వీడియో కేసులో ఇరుక్కోవడం, కూతురు ఇప్పటికే స్మగ్లింగ్ కేసులో జైలులో ఉండటంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+