Diwali News: పండుగ ప్రేమికులు, పెట్ లవర్స్ మధ్య బిగ్ డిబేట్.. X వేదికగా మంట పెట్టిన దీపావళి

Festival vs Pet Lovers: వెలుగుల పండుగ దీపావళి ముగిసి రోజులు గడుస్తున్నా, సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య ఎగసిన మంటలు ఇంకా చల్లారడం లేదు. జంతు ప్రేమికులు రెండు వర్గాలుగా విడిపోయి తమదైన శైలిలో దీపావళి గురించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారీ శబ్దాలు, టపాసుల కాంతుల మధ్య పెంపుడు జంతువులు పరిస్థితి గురించి ఓ యువతి చేసిన పోస్ట్ నెట్టింట ఇప్పటికీ హల్‌చల్‌ చేస్తోంది.

చెడుపై మంచి, చీకటిపై వెలుగు గెలుపునకు దీపావళి పండుగ ప్రతీక. అయితే దీనివల్ల పెంపుడు జంతువుల యజమానులు తీవ్ర సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. వేడుకలో కాల్చే బాణాసంచా పేలుళ్లు, ప్రకాశవంతమైన వెలుగులు చాలా సార్లు జంతువులకు పెనుముప్పుగా పరిణమించిన దాఖలాలు ఉన్నాయి. ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ నెటిజన్ తన పెంపుడు కుక్క దీపావళి వేడుకల సమయంలో ఎదుర్కొన్న కష్టాలను గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె పోస్ట్ ద్వారా సంప్రదాయాలు మరియు జంతు సంక్షేమం మధ్య సున్నితమైన సమతౌల్యం గురించి ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది.

Diwali opens big debate between Pet and festive lovers

బాణాసంచా పేలుళ్ల సమయంలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న తన కుక్క భయంతో వణుకిపోయినట్లు నయోమీ బార్టన్ అనే ఢిల్లీకి చెందిన మహిళ Xలో పోస్ట్ చేశారు. 'హ్యాపీ దీపావళి! నా కుక్కకు గుండె సమస్య ఉంది, గంట నుంచి భయంతో వణుకుతోంది. రెండో రోజు కూడా అది నిద్రలేని రాత్రిని గడుపుతోంది. భారీ శబ్దాలు చేస్తేనే వారి భక్తి పరిపూర్ణమవుతుదంని వారు భావిస్తున్నారు అనుకుంటున్నాను' అని రాసుకొచ్చారు.

బార్టన్ పోస్ట్‌పై నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సానుభూతి చూపిస్తుండగా మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పెంపుడు జంతు యజమానులు ఆమె ఆందోళనను అర్థం చేసుకుని తమ అనుభవాలను షేర్ చేస్తున్నారు. ఇంకొందరు బాణాసంచా సంప్రదాయాన్ని రక్షించాలని పేర్కొంటూ, దాని సాంస్కృతిక ప్రాముఖ్యతను చెబుతున్నారు.

ఒక యూజర్ స్పందిస్తూ అందరికీ సమస్యలు ఉంటాయని, ప్రపంచం మీకోసం మారదని కామెంట్ చేశారు. మరొకరు మీ కుక్కతో దేశాన్ని వదిలి వెళ్లిపోండి అని సలహా ఇచ్చారు. ఇతర పండుగల్లోనూ జంతువులు బాధపడతాయని, దీపావళిని మాత్రమే టార్గెట్ చేయడం ఎందుకు అని మరికొందరు ప్రశ్నించారు. బార్టన్ అతిగా స్పందిస్తున్నారని, ఇలా జరగడం కొత్తేమీ కాదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+