షాక్: కెప్టెన్ తో ఫోటో తీసుకుంటే డబ్బులు ఇవ్వాలి, ఎంతంటే ?
డీఎండీకే చీఫ్ కెప్టెన్ విజయ్ కాంత్ తో కలిసి ఫోటోలు తీసుకోవడానికి వస్తున్నఅభిమానులు ఒక్కొక్కరి దగ్గర ఆ పార్టీ నాయకులు రూ. 100 వసూలు చేస్తున్నారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, కెప్టెన్ విజయ్ కాంత్ కు ఓప్రత్యేక గుర్తింపు ఉంది. పార్టీ కార్యకలాపాల విషయంలో కెప్టెన్ విజయ్ కాంత్ ప్రవర్థించే తీరుతో ఎప్పుడూ ఆయన వార్తల్లో ఉంటారు.
డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయ్ కాంత్ సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన వ్యక్తి. సినీ గ్లామర్ తో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. విజయ్ కాంత్ తో ఫోటోలు తీసుకోవడానికి తమిళనాడులో చాల మంది యువకులు ఉత్సాహం చూపిస్తుంటారు.
ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయనతో ఫోటోలు తీసుకోవడానికి కార్యకర్తలు పోటీ పడుతున్నారు. అయితే విజయ్ కాంత్ ఓ కొత్త నిబంధన అమలులోకి తీసుకు వచ్చారు. తనతో ఫోటో తీసుకోవాలంటే ముందు పార్టీ నాయకులను కలవాలని చెబుతున్నారు.

విజయ్ కాంత్ తో కలిసి ఫోటోలు తీసుకోవడానికి వస్తున్న ఆయన అభిమానులు, కార్యకర్తల నుంచి డీఎండీకే పార్టీ నాయకులు ఒక్కొక్కరి దగ్గర రూ. 100 వసూలు చేస్తున్నారు. విజయ్ కాంత్ తో ఫోటో తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు ముందుగా రూ. 100 చెల్లించాల్సిందే అని నియమాలు పెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న డీఎండీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు షాక్ కు గురైనారు. ఎవరైనా పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఫ్రీగా ఫోటోలకు ఫోజు ఇస్తారని, ఇలా ఫోటో లు తీసుకునే విషయంలో వ్యాపారం చెయ్యడం దేశంలో ఇదే మొదటి సారి చూస్తున్నామని అంటున్నారు.
అయితే ఒక్కో ఫోటోకు ఎందుకు రూ. 100 వసూలు చేస్తున్నారు అనే విషయంపై పార్టీ నాయకులు స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో పార్టీ కార్యకర్తలు, విజయ్ కాంత్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కాంత్ వింత నియమాలతో పార్టీ కార్యకర్తలు కంగుతిన్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications