Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కమలా హ్యారిస్‌కు స్టాలిన్ లేఖ... ద్రవిడ ఉద్యమ ఆత్మవిశ్వాసాన్ని పెంచిన గెలుపంటూ...

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ గెలుపుతో తమిళ జనం సంబరాలు జరుపుకుంటున్నారు. తమిళ మూలాలున్న కమలా అమెరికాలో అత్యున్నత పదవిని చేపట్టడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా డీఎంకె అధినేత ఎంకె స్టాలిన్ కమలా హ్యారిస్‌కు ఓ లేఖ రాశారు. కమల గెలుపుపై సంతోషం వ్యక్తం చేసిన స్టాలిన్... ఆమె గెలుపు ద్రవిడ ఉద్యమానికి మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నారు.

'వణక్కం... తమిళనాడు మూలాలు కలిగిన కమలా హ్యారిస్... అమెరికా మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం తమిళ ప్రజలందరికీ గర్వకారణం. సమ సమాజాన్ని కాంక్షించే ద్రవిడ ఉద్యమ రాజకీయ సిద్దాంతాలకు మీ గెలుపు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మీ మాతృమూర్తి శ్యామలా గోపాలన్ హ్యారిస్ మాతృభాష అయిన తమిళంలో ఈ లేఖ రాయడం నాకు సంతోషాన్నిస్తోంది.' అని స్టాలిన్ పేర్కొన్నారు.

DMK chief MK Stalin writes to Kamala Harris in Tamil, recalls her links to TN

ద్రవిడ సంస్కృతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా అమెరికా ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేలా కమలా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. ముందుచూపు,కఠోర శ్రమ,అంకిత భావంతో అమెరికాను పాలించగలిగే సమర్థత తమిళ మహిళకు ఉందని ఆమె నిరూపించారన్నారు.

కాగా,కమలా హ్యారిస్ పూర్వీకుల మూలాలు తమిళనాడులోని పైంగనాడులో ఉన్న తులసెంథిరపురంలో ఉన్నాయి. కమలా తల్లి హ్యారిస్ సొంతూరు ఇదే కావడంతో... ఆమె గెలుపు తర్వాత ఇక్కడి ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఇంటి వాకిళ్లల్లో రంగురంగుల ముగ్గులతో కమలకు శుభాకాంక్షలు తెలిపారు.

కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ హారిస్ బయోమెడికల్ సైంటిస్ట్. 1960ల్లో ఆమె అమెరికా వెళ్లి... అక్కడే స్థిరపడ్డారు. జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌నే ఎకనమిస్టును వివాహం చేసుకున్నారు. శ్యామలా-డొనాల్డ్ దంపతులకు కమలా హారిస్,మాయా హారిస్ ఇద్దరు కుమార్తెలు. మాయా హారిస్ న్యాయవాదిగా,టెలివిజన్ కామెంటేటర్‌గా,పొలిటికల్ అనలిస్టుగా పనిచేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+