వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ కే నగర్ ఎఫెక్ట్: గవర్నర్ కోసం ముంబైకి డీఎంకే లీడర్స్: రాష్ట్రపతి పాలన!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ముంబై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహిస్తూ ఆమె మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం చేసిన అరచకాలపై గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చెయ్యడానికి డీఎంకే పార్టీ సిద్దం అయ్యింది.

తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావును కలవడానికి బుధవారం ముంబై వెళ్లాలని డీఎంకే పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు. తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే.

మంత్రి ఇంటిలో అవినీతి చిట్టా పేపర్లు

మంత్రి ఇంటిలో అవినీతి చిట్టా పేపర్లు

ఆ సమయంలో ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా స్థానిక ఓటర్లకు నగదు పంచిపెట్టాలని విజయభాస్కర్ సహచర మంత్రులకు లెక్కలు చూపించినట్లు ఉన్న డాక్యూమెంట్లను ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అడ్డంగా బుక్కయిన సీఎం, మంత్రులు

అడ్డంగా బుక్కయిన సీఎం, మంత్రులు

మంత్రి విజయభాస్కర్ ఇంటిలో చిక్కిన పత్రాల్లో సీఎం ఎడప్పాడి పళనిసామితో సహ ఆరుగురు మంత్రుల పేర్లు పూసగుచ్చినట్లు ఉండటంతో ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆర్ కే నగర్ లో విచ్చలవిడిగా రూ. 89 కోట్లు పంచిపెట్టారని స్వయంగా ఐటీ శాఖ అధికారులు అంటున్నారు.

తల దించుకునేలా చేశారు

తల దించుకునేలా చేశారు

ఆర్ కే నగర్ ఉప ఎన్నికలను అవినీతి మయం చేసిన తమిళనాడు ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చెయ్యాలని, మంత్రి విజయభాస్కర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆధికారులకు సూచించాలని డీఎంకే పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

గవర్నక్ కోసం వేచి చూశారు, కానీ ?

గవర్నక్ కోసం వేచి చూశారు, కానీ ?

మంగళవారం గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడు వస్తారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం చెన్నై రాలేదు. ముంబైలోనే ఉన్న గవర్నర్ ను కలుసుకుని తమిళనాడు ప్రభుత్వం మీద ఫిర్యాదు చెయ్యాలని డీఎంకే నాయకులు నిర్ణయించారు.

టీటీవీ దినకరన్ కోసం మంత్రులు

టీటీవీ దినకరన్ కోసం మంత్రులు

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ గెలుపు లక్షంగా వందల కోట్ల రూపాయలు ఖర్చు చెయ్యాలని అధికారంలో ఉన్న మంత్రులు సిద్దం అయ్యారని డీఎంకే పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

వదలిపెట్టకూడదు

వదలిపెట్టకూడదు

ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు వాయిదా పడటానికి కేవలం అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వమే కారణం అని గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చెయ్యాలని డీఎంకే నాయకులు నిర్ణయించారు. సీఎంతో సహ మంత్రులను వదిలిపెట్టరాదని గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని డీఎంకే పార్టీ నాయకులు అంటున్నారు.

గవర్నర్ స్పందన ఎలా ఉంటుందో ?

గవర్నర్ స్పందన ఎలా ఉంటుందో ?

డీఎంకే పార్టీ ఫిర్యాదుతో గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ఏలా స్పంధిస్తారో వేచిచూడాలని తమిళనాడు ప్రజలు అంటున్నారు. గవర్నర్ స్పందన కోసం తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

English summary
DMK going to meet governor Vidyasagar rao today in Mumbai. They will talk about the cancellation of the RK Nagar by election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X