వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ ఎందులో గొప్ప: అసెంబ్లీలో స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళపై ప్రశంసల జల్లు కురిపించిన మంత్రిపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ మండిపడ్డారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మీపార్టీ నాయకురాలిని పొగడటం సరైన పద్దతికాదని స్టాలిన్ హితబోధ చేశారు.

<strong>ఆర్ కే నగర్ లో పోటీ చేస్తా, జయ మేనకోడలు దీపా: శశికళకు ఝలక్!</strong>ఆర్ కే నగర్ లో పోటీ చేస్తా, జయ మేనకోడలు దీపా: శశికళకు ఝలక్!

అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే సెల్వమోహన దాస్ పాండియన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సెల్వరాజ్ సమాధానం చెబుతూ జయలలితను కీర్తించిన తరువాత చిన్నమ్మ శశికళ అంటూ సంబోదిస్తూ ప్రశంసల జల్లు కురిపించడంతో డీఎంకే ఉప సభాపక్ష నాయకుడు దురైమురుగన్ అభ్యంతరం చెప్పారు.

ఆ సమయంలో స్పీకర్ జోక్యం చేసుకుని మంత్రి సెల్వరాజ్ సొంత పార్టీ నాయకురాలిని అభినందస్తూ మాట్లాడటం తప్పుకాదని అన్నారు. ఇలాగే చేస్తే కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు రాహుల్ గాంధీని అభినందిస్తూ మాట్లాడుతారని డీఎంకే పార్టీ నాయకుడు దురైమురుగన్ అన్నారు.

DMK party working president M K Stalin

ఆ సమయంలో సీఎం పన్నీర్ సెల్వం జోక్యం చేసుకుని గతంలో శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే పార్టీ నాయకులు ఏ పదవిలో లేని వ్యక్తులను కీర్తించిన విషయం గుర్తు చేశారు. తరువాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ లేచి అధికార పార్టీపై విరుచుకుపడ్డారు.

<strong>పన్నీర్ సెల్వం చాణక్య ప్రదర్శన: ప్రశంసల జల్లు</strong>పన్నీర్ సెల్వం చాణక్య ప్రదర్శన: ప్రశంసల జల్లు

గతంలో తాము తప్పు చేసినట్లు సీఎం పన్నీర్ సెల్వం చెబుతున్నారు కదా, ఇప్పుడు అధికారంలో ఉన్న ఆ పార్టీ మంత్రులు, శాసన సభ్యులు అదే తప్పు చేస్తుంటే ఎందుకు సమర్థిస్తున్నారని అని ఘాటుగా ప్రశ్నించారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు వారి నాయకులను కీర్తిస్తూ మాట్లాడవచ్చని, అలాగే డీఎంకే పార్టీ సభ్యులు వారి నాయకులను కీర్తిస్తూ మాట్లాడవచ్చని స్పీకర్ ధనపాల్ ఇరు వర్గాలకు నచ్చచెప్పడానికి ప్రయత్నించడంతో సభ రచ్చరచ్చ అయ్యింది.

English summary
Tamil Nadu Assembly sections, AIADMK Party leaders and DMK party working president M K Stalin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X