అబ్బబ్బో ఎవరూ తగ్గట్లేదుగా.. ఏ పార్టీలో ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలుసా !
ఎన్నికల సమయంలో నేతలు సమర్పించిన ప్రకారం.. దేశంలోని రాజకీయ పార్టీల వారీగా.. ఏ పార్టీలో ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయో అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ( ఏడీఆర్ ) వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం బీజేపీ సంఖ్య పరంగా టాప్ లో ఉంటే.. పర్సంటేజ్ పరంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ అగ్రస్థానం దక్కించుకుంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల లోని పార్టీల విషయానికి వస్తే టీడీపీ టాప్ లో నిలుస్తుంది. ఆ జాబితాపై ఓ లుక్కేద్దాం..
ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం బీజేపీలో ఉన్న 1653 మంది ఎమ్మెల్యేల్లో 638 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే దాదాపు 39 శాతం మంది ప్రజాప్రతినిధులపై కేసులు ఉన్నట్టు గమనించవచ్చు. అంతే కాకుండా వారిలోనే 436 మందిపై తీవ్ర నేరాభియోగాలు నమోదైనట్టు తెలుస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఉన్న 646 మంది ఎమ్మెల్యేలలో 339 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఆ ప్రకారం చూస్తే దాదాపు 52 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు వెల్లడవుతోంది. అలానే వారిలో 194 మందిపై తీవ్ర నేరాభియోగాలు నమోదయ్యాయి. దాంతో ఎమ్మెల్యేల లెక్క పరంగా చూస్తే బీజేపీలో ఎక్కువ మందిపై కేసులు ఉండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం పర్సంటేజ్ పరంగా టాప్ లో నిలుస్తున్నారు.
మరోవైపు ప్రాంతీయ పార్టీలను గమనిస్తే బెంగాల్‌కు చెందిన టీఎంసీకి మొత్తంగా 230 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 95 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. వారిలోనే 78 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. ఇక తమిళనాడులోని డీఎంకే పార్టీలోని 132 మంది ఎమ్మెల్యేలలో 98 మంది నేతలపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలోని 42 మందిపై తీవ్ర నేరాభియోగాలు నమోదైనట్టు తెలుస్తోంది. ఆప్ కి చెందిన 123 మంది ఎమ్మెల్యేలలో 69 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. వారిలోనే 35 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.
ఇక ఏపీలోని టీడీపీకి చెందిన 134 మంది ఎమ్మెల్యేలలో 115 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఈ 115 మందిలో కూడా 82 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున కేవలం 11 మంది మాత్రమే విజయం సాధించడంతో వారి జాబితాపై పెద్దగా ఫోకస్ పెట్టలేదని భావిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేల వ్యవహారం అయితే ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక ఈ ఏడీఆర్ జాబితా ప్రకారం మహారాష్ట్రకు చెందిన శరద్ పవార్ పార్టీ-NCP చివరి స్థానంలో ఉంది. ఆ పార్టీలో ఎనిమిది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ఐదుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications