Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Viral Video:బన్నీ పాటకు స్టెప్పులు ఇరగదీసిన డాక్టర్లు..కరోనా టైంలో స్మాల్ రిలీఫ్

ముంబై: నిత్యం కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తూ బిజీ బిజీగా ఉండే డాక్టర్లు ఒక్కసారిగా రిలాక్స్ మూడ్‌లోకి వచ్చారు. ఎప్పుడూ హాస్పిటల్, పేషెంట్లు, మందులు, సర్జరీలతోనే టైమ్ గడుస్తోందని తమకంటూ ఓ రిలాక్సేషన్ పీరియడ్ కావాలని కోరుకున్నారో ఏమో తెలియదు కానీ... ఈ డాక్టర్ల బృందం ఒక్కసారిగా ఓ సూపర్ హిట్ సాంగ్‌కు డ్యాన్స్ వేశారు. అదికూడా యూనిఫారంలో ఉండే ఈ డ్యాన్స్ వేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో అప్‌లోడ్ కావడంతో వీడియో తెగ చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది.

ఓ వైపు దేశాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తోంటే మరోవైపు దానిపై విజయం సాధించేందుకు డాక్టర్లు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఇళ్లు కుటుంబాలను సైతం వదిలేసి కోవిడ్ పేషెంట్లకు చికిత్స చేస్తూ హాస్పిటల్స్‌కే పరిమితమయ్యారు. నిత్యం పీపీఈ కిట్లను ధరించి ఆస్పత్రిలోనే ఈ వైద్యులు కాలం వెల్లదీస్తున్నారు. 24 గంటలు పీపీఈ కిట్లు ధరించి ఉండడమంటే అదో సవాలు లాంటిదే. అయితే తాజాగా ఓ డాక్టర్ల బృందం కొంత సమయం తీసుకుని రిలాక్స్ అయ్యారు. తెలుగులో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్ చేసిన సూపర్ హిట్ సాంగ్ సీటీ మార్‌కు ఈ డాక్టర్లు అదిరిపోయే స్టెప్పులు వేశారు. పాట మనదగ్గరి నుంచి అరువు తీసుకున్నా... అందులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్ మరియ దిశా పటానీలు డ్యాన్స్ చేశారు. సల్మాన్ తాజా చిత్రం రాధేలో ఈ పాట ఉంది. బాలీవుడ్‌ సినిమా అభిమానులను ఈ పాట ఉర్రూతలూగిస్తోంది. అసలే సల్లూభాయ్.. దానికి తోడు మాంచి ఊపు మీదున్న పాట. మరి ఆ పాటను వింటే పీపీఈ కిట్లు ధరించిన డాక్టర్లు కూడా కిట్లను కాసేపు పక్కన బెట్టి అదిరిపోయే స్టెప్పులు వేశారు.

Doctors dance for Allu Arjuns seeti maar song, Video goes viral on social media

మొత్తం 1:30 నిమిషం నిడివిగల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను చుట్టేస్తోంది. ఇందులో ఒరిజినల్ పాటకాకుండా మాండోలిన్ వాయిద్యంతో కూడిన మ్యూజిక్‌కు ఈ డాక్టర్లు స్టెప్పులేశారు. హాస్పిటల్‌లోనే ఈ సాంగ్‌కు డ్యాన్స్ వేసి వీడియోను రికార్డ్ చేశారు. అందరూ నీలం రంగు దుస్తులు ధరించి ముఖాలకు మాస్కులు పెట్టుకుని తలకు కవర్ చేసుకుని స్టెప్పులు ఇరగదీశారు. ఈ వీడియోను హీరోయిన్ దిశా పటానీ ఫ్యాన్ క్లబ్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో ఇది మరింత వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు ఫిదా అయ్యారు. వారికి తోచినట్లుగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ సాంగ్‌ను అటు తెలుగులో ఇటు హిందీలో కూడా ప్రముఖ సంగీత దర్శకులు రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ కంపోజ్ చేశారు. ఈ పాటను కమాల్ ఖాన్ - లులియా వంతూరు పాడారు. మరి ఇంకేముంది... దేవీ మ్యూజిక్ ముందు ఎలాంటి వారైనా సరే కాలు కదపాల్సిందే.. రాధే చిత్రంను ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. మే 13వ తేదీన దాదాపు 40 దేశాల్లో ఈ సినిమా విడుదలైంది.

Doctors dance for Allu Arjuns seeti maar song, Video goes viral on social media
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+