Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రతన్ టాటా పార్థీవ దేహం వద్ద దీనంగా పెంపుడు కుక్క ‘గోవా’

ఆదర్శ పారిశ్రామికవేత్త రతన్ టాటా సాటి మనుషులనే కాదు.. జంతువుల పట్ల అమితమైన ప్రేమను చూపేవారు. రతన్ టాటా చేసిన సేవా కార్యక్రమాలు, జీవాల పట్ల ఆయన చూపిన ప్రేమకు కోట్లాది మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ఆయన ఎంతో ప్రేమ చూసుకునే గోవా అనే కుక్క కూడా తన యజమాని మరణంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది.

రతన్ టాటా పార్థీవ దేహం వద్దకు చేరుకున్న ఆ కుక్క దీనంగా చూస్తూ ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రతన్ టాటా ఎన్నో వీధి కుక్కలను ఆదరించి వాటి సంరక్షణను చూసుకున్నారు. రతన్ టాటాకు మూగ జీవాలపై ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి.. పెంపుడు కుక్క అనారోగ్యంతో ఉందని కింగ్ చార్లెస్ ను కలిసే ప్రొగ్రాంను కూడా రతన్ టాటా వాయిదా వేసుకోవడం ఒక ఉదాహరణ.

Dog Goa pays tribute at Ratan Tata s cremation

మనసుకు హత్తుకునే ఈ విషయాన్ని సుహెల్ సేథ్ అనే భారతీయ వ్యాపారవేత్త వెల్లడించారు. రతన్ టాటా నుంచి తనకు 11 మిస్ట్ కాల్స్ వచ్చాయని.. చివరకు తనను సంప్రదించగా తన పెంపుడు కుక్క ఒకటి అనారోగ్యంతో ఉందని, అందుకే దానిని వదిలి అవార్డు తీసుకోలేనని రతన్ టాటా చెప్పినట్లు సుహెల్ సేథ్ తెలిపారు. ఇది విన్న ప్రిన్స్ చార్లెస్.. రతన్ టాటాను అభినందించారు.

కాగా, రతన్ టాటా దత్తత తీసుకున్న కుక్క పేరు గోవా. ఆయనకు ఎంతో ఇష్టమైన శునకం ఇది. గోవాలో దొరకడంతో దానికి ఆ పేరు పెట్టారు. సమావేశాలకు కూడా ఈ శునకం రతన్ టాటాతో కలిసి వెళ్లేది. ఈ ఏడాది జులైలో రతన్ టాటా ముంబైలో చిన్న జంతు ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రిలో అత్యుధునిక సాంకేతిక సౌకర్యాలు కల్పించారు. సంక్లిష్ట వ్యాధులకు చికిత్స అందేలా నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+