బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Doute: అరెస్టు వారెంట్ ఇచ్చిన కోర్టు, పోలీస్ స్టేషన్ లాకప్ లో యువకుడు ?, ఆరేళ్ల క్రితం కేసులో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పాత కేసుకు సంబంధించి కేసు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అతని మీద వారెంట్‌ జారీ చేసింది. కోర్టు వారెంట్ తో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లారు. పోలీసుల అదుపులో ఉన్న యువకుడు పోలీస్ స్టేసన్ లాకప్ లోనే చనిపోయాడు. లాకప్ డెత్ అయ్యిందని యువకుడి కుటుంబ సభ్యులు ఆందోళనకుదిగారు.

తెల్లవారుజామున బెంగళూరులోని కాటన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే పోలీసుల దాడి వల్లే మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బెంగళూరులోని భక్షి గార్డెన్‌లో నివాసం ఉంటున్న వినోద్ (23) అనే యువకుడు కాటన్ పేట్ పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

romance: నాటీ అల్లుడు, రొమాంటిక్ అత్త, అర్దరాత్రి అత్తను లేపుకుపోయిన కొత్త అల్లుడు, హయ్యారే హయ్యా !romance: నాటీ అల్లుడు, రొమాంటిక్ అత్త, అర్దరాత్రి అత్తను లేపుకుపోయిన కొత్త అల్లుడు, హయ్యారే హయ్యా !

Doute: The young man who was found dead suspiciously in the police station lockup in Bengaluru, was it a lockup death?

ఆరేళ్ల క్రితం నాటి కేసులో వినోద్ ను అరెస్టు చేసిన పోలీస్‌స్టేషన్‌లోని సెల్‌లో ఉంచినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారులు అంటున్నారు. 2017లో ఓ దోపిడీ కేసులో వినోద్‌ను కాటన్‌పేట పోలీసు అధికారులు అరెస్ట్‌ చేశారు. అప్పట్లో జైలుకు వెళ్లిన వినోద్ బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కానీ వినోద్ కేసు విచారణకుక కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరగడంతో కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

కోర్టు వారెంట్‌ ఆధారంగా కాటన్‌పేట పోలీసులు నిందితుడు వినోద్ ను బుధవారం అరెస్టు చేశారు. గురువారం ఉదయం కోర్టులో హాజరుపరిచేందుకు వినోద్ ను కాటన్ పేట్ పోలీస్‌స్టేషన్‌ లోని సెల్‌లో ఉంచారు. అయితే తెల్లవారుజామున అపస్మారక స్థితిలో ఉన్న వినోద్‌ను గుర్తించిన పోలీసులు వెంటనే అతన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చెయ్యడానికి ప్రయత్నించిన వైద్యుడు నిందితుడు వినోద్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారని బెంగళూరు పశ్చిమ డివిజన్ డీసీపీ లక్ష్మణ్ నింబరాగి తెలిపారు.

girlfriend: అక్రమ సంబంధం, మద్యాహ్నం కోరిక తీర్చినా, రాత్రికి రమ్మంటే ఎలా ?, నీకు అదే పనేనా ? !girlfriend: అక్రమ సంబంధం, మద్యాహ్నం కోరిక తీర్చినా, రాత్రికి రమ్మంటే ఎలా ?, నీకు అదే పనేనా ? !

పోలీసుల దాడితో లాకప్ లో వినోద్ మృతి చెందాడని, పోలీసుల దాడితో వినోద్ లాకప్‌లోనే చనిపోయాడని, ఇది సహజ మరణం కాదని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వినోద్ మీద దాడి చేసి లాకప్ డెత్ చేసిన పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినోద్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వినోద్ లాకప్ డెత్ కేసు సీఐడీకి అప్పగిస్తామని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

English summary
Doute: The young man who was found dead suspiciously in the police station lockup in Bengaluru, was it a lockup death ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X