కేంద్ర మంత్రి బాబుల్ అధికారిక కారులో డ్రైవర్ శవం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో డ్రైవర్ మృతదేహం ఢిల్లీలోని ఉద్యోగ భవన్ అధికారిక అంబాసిడర్ కారులో కనిపించింది. ఈ మేరకు గురువారం వార్తలు వచ్చాయి. అత్యంత భారీ భద్రతా లోపంగా దీన్ని భావిస్తున్నారు. గత 12 గంటలుగా డ్రైవర్ శవాన్ని భద్రతా సంస్థలు కనిపెట్టలేకపోయాయి.

బుధవారం ఉదయం డ్రైవర్ శవాన్ని సిఐఎస్ఎఫ్ అధికారి ఒకరు గుర్తించారు. ఉద్యోగ భవన్‌లో ప్రభుత్వ మంత్రిత్వ శాఖలుంటాయి. అది సిఐఎస్ఎఫ్ రక్షణలో ఉంటుంది. పశ్చిమ బెంగాల్ నుంచి బిజెపి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన సుప్రియో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.

 Driver's body found in Union Minister Babul Supriyo's official car

మృతుడిని వినోద్ ఖండూరిగా గుర్తించారు. అతను కొద్ది నెలలుగా మంత్రి వద్ద పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతను లక్ష్మినగర్‌లో తన కుటుంబ సభ్యులతో ఉంటున్నట్లు తెలుస్తోంది. తాము ఫోన్ చేసినా ఖండూరి మొబైల్ ఎత్తకపోవడంతో అతని కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో న్యూఢిల్లీలోని తుగ్గక్ రోడ్డు పోలీసు స్టేషన్‌లో అదృశ్యం కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప అతని మృతికి కారణం ఏమిటనేది తెలియదు. ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి అది సహజమరణమేనని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+