Drugs racket: వ్యాపారవేత్తకు బెండ్, మొండికేస్తున్న నటి, నాకేం తెలుసు ? కిక్ అంటే ఏమిటి?
బెంగళూరు/ ముంబయి/ న్యూఢిల్లీ: బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే స్యాండిల్ వుడ్ ఫేమస్ నటి రాగిణిని అరెస్టు చేసిన బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న నటి రాగిణి ద్వివేది పోలీసు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్పకుండా మొండికేస్తూ 'నాకు ఏమీ తెలీదు, నేను అమాయకురాలు ' 'చాక్లెట్ అంటే ఏమిటి' అంటూ నాటకాలు ఆడటంతో పోలీసులు విసిగిపోతున్నారని తెలిసింది. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనకు బెండ్ తీసి రసం పిండి వివరాలు సేకరిస్తున్నారు. కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు, కొందరు సెలబ్రిటీలను హై ప్రొఫైల్ పార్టీలు, ఫంక్షన్ లకు ఆహ్వానిస్తున్న ఆ వ్యాపారవేత్త గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఆ ప్రముఖ వ్యాపారవేత్తను అరెస్టు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Recommended Video

రాత్రి మస్త్ షాక్ ఇచ్చిన క్రైమ్ బ్రాంచ్
బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసును బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సవాలుగా స్వీకరించారు. ఆదివారం రాత్రి బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్తను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే డ్రగ్స్ మాఫియా కేసులో పోలీసుల అదుపులో ఉన్న కొందరు ఇచ్చిన సమాచారం మేరకు వ్యాపారవేత్తను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని సమాచారం.

హై ప్రొఫైల్ పార్టీలు
పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యాపారవేత్త ఇంతకాలం చాల వ్యవహారాలు నిర్వహించాడని పోలీసులు అంటున్నారు. కొందరు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలతో హై ప్రొఫైల్ పార్టీలు నిర్వహించాడని, ఆ పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేశాడనే ఆరోపణలు రావడంతో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని సమాచారం.

సార్...... ఆయనే మాకు ‘కిక్కు’ఇచ్చాడు !
బెంగళూరులో జరిగిన హై ప్రొఫైల్ పార్టీలకు ప్రముఖ వ్యాపారవేత్త డ్రగ్స్ సరఫరా చేశాడని పోలీసుల అదుపులో ఉన్న కొందరు నిందితులు సమాచారం ఇచ్చారని. ఆ వివరాల ఆధారంగానే ఆయన్ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. పక్కా సాక్షాలు సేకరించి వ్యాపారవేత్తను అరెస్టు చేసి సోమవారం న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు సిద్దం అవుతున్నారని సమాచారం.

మొండికేస్తున్న నటి రాగిణి
డ్రగ్స్ దందా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్ రాగిణి ద్వివేదిని అరెస్టు చేసిన బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు శనివారం న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి అనుమతితో మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు నటి రాగిణి ద్వివేదికి అనేక ప్రశ్నలు వేసినా ఆమె సమాధానం చెప్పకుండా మొండికి వేస్తున్నారని తెలిసింది.

ఏమో... నాకు తెలీదు..... చెప్పలేను
బెంగళూరు నగరంలోని సిద్దాపురలోని స్టేట్ హోమ్ లో నటి రాగిణిని పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ అధికారి అంజుమాల సిద్దాపురలోకి స్టేట్ హోమ్ కు వెళ్లి నటి రాగిణి ద్వివేదికి అనేక ప్రశ్నలు వేసినా ఏమో ? నాకు తెలీదు ? నేను చెప్పలేను అంటూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మొండికి వేస్తున్నారని తెలిసింది.

రాగిణిని ఏం చెయ్యాలి ?
గంటల పాటు నటి రాగిణి ద్వివేదిని ప్రశ్నించిన విచారణ అధికారి అంజుమాల ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడంతో విసిగిపోతున్నారని సమాచారం. సోమవారంతో నటి రాగిణి ద్వివేది పోలీసు కస్టడీ గడుపు పూర్తి కానుంది. మరింత సమాచారం సేకరించడానికి నటి రాగిణిని మరోసారి కస్టడీకి తీసుకోవాలని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు సిద్దం అవుతున్నారని తెలిసింది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications