ఎయిర్ ఇండియా విమానంలో తాగుబోతు వీరంగం, మహిళ మీద మూత్రం !
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో పీకలదాక మద్యం సేవించిన తాగుబోతు సాటి ప్రయాణికురాలిపట్ల దారుణంగా ప్రవర్తించాడు. ప్రయాణికులు అందరూ చూస్తుండగానే ప్యాంట్ విప్పి పక్కన ఉన్న ప్రయాణికురాలి సీటు మీద మూత్రం పోశాడు. అయినా ఎయిర్ ఇండియా సిబ్బంది అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి.
ఈ విషయంపై ప్రయాణికురాలి కుమార్తె ఇంద్రాణి ఘోష్ ఎయిర్ ఇండియా సిబ్బందిని సోషల్ మీడియాలో నిలదీశారు. గురువారం న్యూయార్క్ లోని జేఎఫ్ కే విమానాశ్రం నుంచి ఢిల్లీ బయలుదేరిన AI102 అంతర్జాతీయ విమానంలో తన తల్లి ప్రయాణించారు.

విమానంలో ఓ తాగుబోతు ప్యాంట్ విప్పి తన తల్లి కుర్చున్న సీటు మీద మూత్రం పోశాడు. ఒంటరిగా ప్రయాణిస్తున్న తన తల్లి షాక్ కు గురైనారు. ఢిల్లీ విమానాశ్రయంలో వీల్ చేర్ లో కుర్చుని ఉన్న తన తల్లి ఆ తాగుబోతు విమానాశ్రయం బయటకు దర్జాగా వెళ్లిపోయిన విషయం గుర్తించారు.
ఇంత జరిగినా మీరు ఎందుకు ఆ తాగుబోతు మీద చర్యలు తీసుకోలేదు అని మహిళా ప్రయాణికురాలు కుమార్తె ఇద్రాణి ఘోష్ ఎయిర్ ఇండియా సిబ్బందిని నిలదీశారు. ఈ విషయంపై ఎయిర్ ఇండియాకు ఫిర్యాదు చెయ్యడానికి కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే వెబ్ సైట్ లో ఫీడ్ బ్యాక్ రాయాలంటూ మెసేజ్ వచ్చిందని ఇంద్రాణి ఘోష్ అసహనం వ్యక్తం చేశారు.
ఈ విషయం కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా దృష్టికి వెళ్లడంతో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మీ తల్లిగారికి ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడం దురదృష్టకరం, వెంటనే ఆ ప్రయాణికుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా ఇంద్రాణికి ట్వీట్ చేశారు.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications