పీకలదాకా తాగి టెక్కీ గొడవ, విచారిస్తే రేప్ కేసు నిందితుడు, నెలరోజులు, బ్యాడ్ లక్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు నగరంలో ప్రసిద్ది చెందిన కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న వివాహితుడు తనకు పెళ్లి కాలేదని నమ్మించి హైదరాబాద్ కు చెందిన మహిళ (39)ను నమ్మించి శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేసి మాయం అయ్యాడు. చివరికి పీకలదాక మద్యం సేవించి బార్ లో సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడు. పోలీసులు విచారణ చేస్తే అతను రేప్ కేసులో నిందితుడు అని తెలిసి ఆశ్చర్యానికి గురైనారు.

భార్య, కుమారుడు

భార్య, కుమారుడు

బెంగళూరులోని మారతహళ్ళిలో నివాసం ఉంటున్న నాగార్జున (30) అనే యువకుడికి పెళ్లి అయ్యింది. భార్య, ఏడాది వయసు ఉన్న కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. నాగార్జున ప్రసిద్ది చెందిన కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు.

 వెబ్ సైట్ లో ప్రొఫైల్

వెబ్ సైట్ లో ప్రొఫైల్

నాగార్జున ఓ వెబ్ సైట్ లో అతని ఫోటో ప్రొఫైల్ పెట్టాడు. తనకు పెళ్లి కాలేదని, ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే పెళ్లి చేసుకుంటానని వెబ్ సైట్ లో వివరించాడు. హైదారాబాద్ లో నివాసం ఉంటూ భర్తతో విడాకులు తీసుకుని 10 ఏళ్ల కుమారుడితో కలిసి ఉంటున్న మహిళ (39) నాగార్జునకు పరిచయం అయ్యింది.

పెళ్లి ముసుగులో ఆమెను !

పెళ్లి ముసుగులో ఆమెను !

హైదారాబాద్ కు చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2017 ఆగస్టు నుంచి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఎంతకాలం అయినా పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె ఒత్తిడి చేసింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి ఎక్కవ కావడంతో నాగార్జున ఆమెకు దూరం అయ్యాడు.

టెక్కీ మీద రేప్ కేసు

టెక్కీ మీద రేప్ కేసు

మహిళ విచారణలో నాగార్జునకు ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని తెలిసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన మీద చాలాసార్లు అత్యాచారం చేశాడని హైదరాబాద్ మహిళ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మీద కేసు నమోదు అయ్యిందని తెలుసుకున్న నాగార్జున నెల రోజుల నుంచి ఇంటికి, ఉద్యోగానికి వెళ్లకుండా మాయం అయ్యాడు.

తాగి వాగి చిక్కాడు

తాగి వాగి చిక్కాడు

మారతహళ్ళిలోని ఓ బార్ లో రాత్రి పీకలదాక మద్యం సేవించిన నాగార్జున సర్వీసు సక్రమంగా చెయ్యడం లేదని, తాను బిల్ చెల్లించనని అక్కడి సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడు. రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు బార్ సిబ్బంది సమాచారం ఇచ్చారు.

విచారిస్తే రేప్ కేసు

విచారిస్తే రేప్ కేసు

పోలీసులు నాగార్జునను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బుద్దిమాటలు చెప్పారు. అతని గురించి ఆరా తియ్యగా పోలీసులు షాక్ కు గురైనారు. నెల రోజుల నుంచి రేప్ కేసులో వెతుకుతున్న టెక్కీ నాగార్జున ఇతనే అని తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి హైదారాబాద్ మహిళకు సమాచారం ఇచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a stroke of utter bad luck for a criminal and good fortune for the authorities, a man arrested for a drunken brawl turned out to be a convict on the run from alleged gang rape charges. 29-year-old techie Nagarjuna, a resident of Marathahalli, had been absconding for a month after a 39-year-old woman filed charges of cheating and rape against him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి