బెంగళూరులో ఆ ప్రాంతంలో అండర్ పాస్ లు జలమయం, వార్నింగ్ బెల్ కొట్టిన అధికారులు !
బెంగళూరు: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బెంగళూరు నగరంలోని పలు రహదారులు అస్తవ్యస్తం అయ్యాయి. బెంగళూరు నగరంలో సోమవారం మధ్యాహ్నం ప్రారంభమై వాన రాత్రంతా కురిసిన కారణంగా కొన్ని అండర్‌పాస్‌లు జలమయం అయ్యాయి. బెంగళూరులో భారీ వానల దెబ్బతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
బెంగళూరు నగరంలోని హెబ్బళ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవినగర్ అండర్‌పాస్ సమీపంలో వర్షం కారణంగా రహదారి జలమయమైంది. ఆ మార్గంలో ప్రయాణించవద్దని, ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించాలని బీబీఎంపీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు మనవి చేశారు. త్వరలో అండర్ పాస్ లో సజావుగా ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

బెంగళూరు నగరంలో కొన్ని ప్రాంతాల్లో సోమవారం మద్యాహ్నం, పలు ప్రాంతాల్లో సాయంత్రం మొదలైన భారీ వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగడంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బెంగళూరు నగరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే బెంగళూరులో ఉత్తర, బెంగళూరు పశ్చిమ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది.
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో 2015 నవంబర్ తరువాత సోమవారం అత్యధికంగా వర్షపాతం నమోదైంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత యలహంకలో అత్యధికంగా 147.5 మి.మీ వర్షం కురిసింది. బెంగళూరు నగరంలోని మంగళవారం మద్యాహ్నం కూడా పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.
బెంగళూరుకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి హైదరాబాద్ కు వెళ్లిపోవడంతో పలు ప్రాంతాల్లోని ప్రజలు నాయకులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. అయితే బీబీఎంపీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారని సంబంధిత అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications