కాసేపట్లో పరీక్ష.. విద్యార్థి హాల్ టికెట్ ఎత్తుకెళ్లిన గద్ద.. తర్వాత ఏమైంది..?
ఏ పరీక్షకు అయినా హాల్ టికెట్ ముఖ్యం. హాల్ టికెట్ లేకపోతే అధికారులు పరీక్ష రాయనివ్వరు. అందుకే స్టూడెంట్స్ పరీక్షకు ఒకరోజు ముందే హాల్ టికెట్ బ్యాగులో పెట్టుకుంటారు. హడావుడిలో మర్చిపోతామని వారి భయం. అయితే కాసేపట్లో పరీక్ష అనగా ఓ గద్ద ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు కానీ.. విద్యార్థి హాల్ టికెట్ ఎత్తుకెళ్లింది. దీంతో ఆ విద్యార్థి బిక్క ముఖం వేశాడు. తర్వాత ఏమైంది..?
కేరళలోని కసర్ గోడ్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ గద్ద ఆ పాఠశాలలోని 300 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్టాఫ్.. అందర్నీ రఫ్పాడించింది. కాసేపట్లో పరీక్ష అనగా.. ఓ విద్యార్థి కిటికీ పక్కన పెట్టుకున్న హాల్ టికెట్ ను ఎత్తుకెళ్లింది. ఇంకో రెండు మూడు నిమిషాలైతే పరీక్ష స్టార్ట్ అవుతోంది అనగా హాల్ టికెట్ ను విడిచి పెట్టింది.

కేరళలోని కసర్ గోడ్ జిల్లాలోని ఓ పాఠశాలలో కేరళ టెన్త్ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 7:30 గంటల సమయంలో ఓ విద్యార్థి కిటీకీ పక్కన కూర్చుని చదువుకుంటూ ఉన్నాడు. హాల్ టికెట్ ను కిటికీ పక్కనే పెట్టాడు. ఇంతలో ఓ గద్ద ఒక్కసారిగా వచ్చి ఆ హాల్ టికెట్ ఎత్తుకెళ్లింది. పాఠశాల పై అంతస్తులోని కిటికీపై నిల్చొని చూస్తూ ఉంది. దీంతో తోటి విద్యార్థులు గద్దకు రాళ్లు విసిరారు. అయినా హాల్ టికెట్ వదల్లేదు.
దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ విద్యార్థి విలపించడం స్టార్ట్ చేశాడు. ఇంకో రెండు మూడు నిమిషాల్లో పరీక్ష స్టార్ట్ అవుతోంది అనగా ఆ గద్ద హాల్ టికెట్ ను ఆ విద్యార్థి వద్ద విడిచి వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆ విద్యార్థి పరీక్ష హాల్ కు పరిగెత్తి పరీక్ష రాశాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రూల్స్ ప్రకారం హాల్ టికెట్ లేకుండా పరీక్ష హాల్ లోకి రానివ్వరని.. చివరి నిమిషంలో విద్యార్థికి హాల్ టికెట్ దొరికింది కాబట్టి ఎగ్జామ్ రాసేందుకు లోపలికి పంపించామని ఉపాధ్యాయులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications