ఢిల్లీ నుంచే ఈసీ ఓట్ల చోరీ ? రాష్ట్రాల్లో ఏమీ లేదా ? సుప్రీం ఆర్డర్ బేఖాతర్- మరో బిగ్ బాంబ్..!

గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నా ఈసీ (ECI) తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ తాజాగా ఎన్నికల కమిషన్లో సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, తోటి కమిషనర్లను లెక్కచేయడం లేదని బయటపెట్టిన పరిశోధనాత్మక కథనం సంచలనం రేపుతోంది. దీనికి కొనసాగింపుగా ఇవాళ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇందులో రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఢిల్లీ నుంచే ఐటీ సాఫ్ట్ వేర్ ద్వారా ఓట్ల మార్పులు ఎలా జరిగిపోతున్నాయో వివరించింది. అంతే కాదు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా, కమిషనర్లు అభ్యతంరం చెప్తున్నా లెక్కచేయకుండా కమిషన్ ఈ తంతు ఎలా సాగించిందో గోవా ఉదాహరణతో బయటపెట్టింది.

బెంగాల్లో రీ పోలింగ్ - సీఈసీ జ్ఞానేష్ అరెస్ట్..! దీదీ డిమాండ్..!
బెంగాల్లో రీ పోలింగ్ - సీఈసీ జ్ఞానేష్ అరెస్ట్..! దీదీ డిమాండ్..!

గోవాలో సర్ పై ఈసీ నిర్ణయాలు (ECI)

గోవాలో జరిగిన ఒక తాజా పరిణామం భారత ఎన్నికల సంఘం అంతర్గత పనితీరును బయటపెట్టిందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురించింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన ఈ ఓటర్ల సవరణ ప్రక్రియలో, నిబంధనల ప్రకారం అర్హులైనప్పటికీ ఓటర్ల జాబితా నుండి పేర్లు గాలికీ పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాజ్యాంగం ప్రకారం ఓటర్ల జాబితాను రూపొందించే లేదా అందులో సవరణలు చేసే ప్రాథమిక బాధ్యత స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకే ఉంటుంది. కానీ ఈసీ దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన 'ఈసీఐనెట్' (ECINet) అనే కొత్త క్లౌడ్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్ వల్ల ఈ అధికారాలన్నీ ఢిల్లీలోని ఐటీ విభాగానికి బదిలీ అయ్యాయి. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి స్వయంగా దరఖాస్తులు స్వీకరించి, నిజనిజాలు పరిశీలించే స్థానిక అధికారుల నిర్ణయాలు ఈ సాఫ్ట్‌వేర్ పరిమితుల వల్ల నిరర్థకంగా మారిపోతున్నాయని ఈ కథనం తెలిపింది.

ECI IT System Failure in Goa How 97 Eligible Voters Were Denied Rights Despite SC Orders
CEC జ్ఞానేష్ పై వేటుకు విపక్షాల డిమాండ్..! ముప్పేట దాడితో EC క్లారిటీ..!
CEC జ్ఞానేష్ పై వేటుకు విపక్షాల డిమాండ్..! ముప్పేట దాడితో EC క్లారిటీ..!

ఢిల్లీ సాఫ్ట్ వేర్ లోనే అంతా

ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్‌లో ఒకసారి నమోదైన మార్పులను తిరిగి వెనక్కి తీసుకోవడానికి స్థానిక అధికారులకు ఎలాంటి సాంకేతిక సదుపాయం కల్పించలేదు. దీనివల్ల పొరపాట్లు లేదా మార్పులను సరిదిద్దే అధికారం కూడా ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎన్నికల కమిషనర్లు జోషి, సంధూ గత కొన్ని నెలలుగా ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో ఉండే ఎస్డీఎం స్థాయి అధికారులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకుండా, ఈసీఐ ఐటీ విభాగం ఎలా అడ్డుకుంటుందో వారు తమ నివేదికలలో స్పష్టంగా రికార్డు చేశారు. గత జనవరిలో సుప్రీంకోర్టు ఓటర్ల జాబితాలో లాజికల్ వ్యత్యాసాల కారణంగా తొలగించిన ఓటర్లకు స్థానికంగా నోటీసులు ఇచ్చి, వారి పత్రాలను పునఃపరిశీలించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

CEC జ్ఞానేష్ కూతురికి సుప్రీం ఊరటపై వివాదం- రోస్టర్ ఉల్లంఘన, 5 లక్షల ఫైన్ పై స్టే..!
CEC జ్ఞానేష్ కూతురికి సుప్రీం ఊరటపై వివాదం- రోస్టర్ ఉల్లంఘన, 5 లక్షల ఫైన్ పై స్టే..!

సుప్రీంఆదేశాలూ బేఖాతర్

తమిళనాడుకు సంబంధించిన పిటిషన్లపై ఇచ్చిన ఈ ఆదేశాలు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. దీని ప్రకారం గోవా ఎన్నికల ప్రధాన అధికారిక్షేత్రస్థాయిలో అర్హులైన ఓటర్ల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించారు.స్థానిక అధికారుల సమగ్ర విచారణ తర్వాత వీటిలో 97 మంది దరఖాస్తుదారులు ఓటర్లుగా ఉండడానికి పూర్తి అర్హులని నిర్ధారించారు. వీరి పేర్లను తుది జాబితాలో చేర్చడం కోసం గతంలో తప్పుగా తీసుకున్న తొలగింపు నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని అధికారులు భావించారు. కానీ, ఈ మార్పు చేసేందుకు కావాల్సిన సాంకేతిక ఆధారాలు లేదా రోల్‌బ్యాక్ అనుమతులు ఢిల్లీలోని ఈసీ ఐటీ విభాగం వద్ద ఉండటంతో స్థానికంగా ఏమీ చేయలేకపోయారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు కేవలం ఏడు రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో, గోవా సీఈఓ సంజయ్ గోయల్ అత్యంత వేగంగా స్పందించారు. ఢిల్లీలోని ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరిస్తూ వరుసగా ఎనిమిది అత్యవసర ఇమెయిల్స్ పంపారు.

ECI IT System Failure in Goa How 97 Eligible Voters Were Denied Rights Despite SC Orders
EC ఎపిసోడ్ లో మరో బిగ్ ట్విస్ట్- సీఈసీతో విభేదిస్తున్న కమిషనర్లపైకి ఈడీ, సీబీఐ ?
EC ఎపిసోడ్ లో మరో బిగ్ ట్విస్ట్- సీఈసీతో విభేదిస్తున్న కమిషనర్లపైకి ఈడీ, సీబీఐ ?

చివరకు ప్రజాస్వామ్యం ఖూనీ..!

సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ, అర్హులైన ఆ 97 మంది ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చడానికి వీలుగా సాఫ్ట్‌వేర్‌లో రోల్‌బ్యాక్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలని ఉన్నతాధికారుల్ని పదే పదే కోరారు. చివరికి ఫిబ్రవరి 18వ తేదీన ఈసీ డిప్యూటీ కమిషనర్ సంజయ్ కుమార్ సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఐటీ విభాగం ఎటువంటి అడ్డంకులు సృష్టించకూడదని, స్థానిక ఈఆర్‌ఓలు తీసుకున్న నిర్ణయం మేరకు వెంటనే ఓటర్ల పేర్లను చేర్చాలని ఐటీ విభాగం డైరెక్టర్ జనరల్ సీమా ఖన్నాకు లేఖ ద్వారా ఆదేశించారు. తక్షణమే ఈ సాంకేతిక ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన తన ఇమెయిల్‌లో స్పష్టంగా తెలిపారు. అయినా ఢిల్లీలోని ఈసీ ఐటీ విభాగం ఆ ఈ-మెయిల్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఫిబ్రవరి 21న విడుదల చేసిన తుది జాబితాలో ఆ 97 మంది అర్హులైన ఓటర్ల పేర్లు లేకుండానే ప్రచురణ పూర్తయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+