ED Raids: అమెజాన్-ఫ్లిప్‍కార్ట్ పై ఈడీ దాడులు.. పలు ప్రాంగణాల్లో సోదాలు, ఎందుకంటే?

Amazon-Flipkart: దేశీయ ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేస్తున్న కొంతమంది విక్రేతల కార్యాలయాలపై నేడు ఈడీ అధికారులు దాడులు నిర్వహించింది. ఈకామర్స్ దిగ్గజాలు విదేశీ పెట్టుబడి చట్టాలను ఉల్లంఘించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఈక్రమంలో ఈడీ అధికారులు దిల్లీ, ముంబై, బెంగళూరుల్లో దాడులు చేపట్టారు. విదేశీ మారకపు చట్టాలను ఉల్లంఘించినట్లు అనుమానించబడిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు సంబంధించిన విక్రేతలను లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదిక సూచిస్తుంది. ఇవి భారత యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ ఇటీవలి నివేదికను అనుసరిస్తుంది. ఇది రెండు కంపెనీలు పోటీని బలహీనపరిచే విధంగా ఎంపిక చేసిన విక్రేతలకు ప్రాధాన్యతనిచ్చినట్లు వెల్లడైంది. భారతీయ చట్టం విదేశీ ఈ-కామర్స్ కంపెనీలను ఇన్వెంటరీని కలిగి ఉండకుండా నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లాట్‌ఫారమ్‌లు ఇండిపెండెంట్ విక్రయదారులకు మాత్రమే వేదికను అందించాలని ఆదేశించింది.

ED officials raid Amazon Flipkart sellers in many Areas over foreign investment violations

నిర్దిష్ట విక్రయదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిని నివేదిక ఉదహరించింది. ఈ ఈ-కామర్స్ ప్లేయర్‌లు నిర్దిష్ట విక్రేతల జాబితాపై నిశిత నియంత్రణను కొనసాగించడం ద్వారా విదేశీ మారకపు నిబంధనలను ఉల్లంఘించారా లేదా అనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు ధృవీకరించింది. కొన్నేళ్లుగా స్టోర్ రిటైలర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఇష్టపడే కొందరు విక్రేతలతో కలిసి పని చేయడం ద్వారా పెట్టుబడి నిబంధనలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. చిన్న చిల్లర వ్యాపారులకు ప్రతికూలత కలిగిస్తుందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రెండు కంపెనీలు పూర్తిగా భారతీయ నిబంధనలకు లోబడి పనిచేస్తున్నట్లు వెల్లడించాయి. ఈడీ దాడుల వ్యవహారంపై రెండు దిగ్గజ కంపెనీలు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+