గణేశుడిపై గుడ్లతో దాడి.. ముస్లిం యువకులకు వినూత్న శిక్ష (వీడియో)
గుజరాత్‌లోని వడోదరలో గణేష్ ఉత్సవాల వేళ మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు యువకులు ప్రయత్నించి ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తుండగా.. దానిపై గుడ్లు విసిరిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారిని వినూత్న పద్ధతిలో శిక్షించారు. ఈ చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పోలీసుల కఠిన వైఖరి
వడోదర పోలీసు కమిషనర్ నరసింహ కొమార్ ఆదేశాల మేరకు.. పోలీసులు నిందితులను చేతులు కట్టి, ఊరేగింపుగా సంఘటన జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు. గణపతిపై గుడ్లు విసిరిన చోట నిందితులను మోకాళ్లపై కూర్చోబెట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పించారు. ఈ కఠినమైన చర్య ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు ఎవరూ పాల్పడకుండా ఒక స్పష్టమైన సందేశం పంపాలని పోలీసులు భావించారు.

ఘటన వివరాలు ఇలా..
సోమవారం రాత్రి వడోదరలోని సిటీ ప్రాంతంలో గణపతి ఊరేగింపు జరుగుతున్న సమయంలో కొందరు దుండగులు గుడ్లు విసిరారు. వాటిల కొన్ని వినాయక విగ్రహంపై పడటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ఒక మైనర్ సహా ముగ్గురు ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో దర్యాప్తులో భాగంగానే నిందితులను సంఘటన స్థలానికి తీసుకువచ్చినట్లు డీసీపీ హిమాన్షు వర్మ వెల్లడించారు. ఊరేగింపు సమయంలో నిందితులు చేతులు జోడించి ప్రజల ముందు క్షమాపణ కోరుతూ కనిపించారు. ఈ ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. వడోదరలో సుమారు 1300 ప్రదేశాలలో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఉన్నాయి. ఈ సంఘటన జరిగిన పానీగేట్ ప్రాంతం హిందూ-ముస్లిం జనాభా అధికంగా ఉండే అతి సున్నితమైన ప్రాంతం. అందువల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిటీ పోలీస్, క్రైమ్ బ్రాంచ్ అధికారులు సంఘటనా స్థలంలో భారీగా మోహరించారు.
Public Apology, Public Lesson – Disturbing Peace Comes at a Cost
— Our Vadodara (@ourvadodara) August 27, 2025
In Vadodara, miscreants attempted to disrupt communal harmony by targeting Ganesh idols at Nirmal Park Yuvak Mandal in Ward 17, where eggs were hurled at the deity. Acting swiftly, police arrested three accused… pic.twitter.com/aoyvmGbHo8
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications