గుంపులుగా వచ్చాయి కానీ, పందులు కాదు! సింహాలే!! వీధుల్లో హల్చల్ (వీడియో)
సాధారణంగా వీధుల్లో రాత్రిపూట కుక్కల గుంపులు తిరుగుతున్న దృశ్యాలు చూస్తూనే ఉంటాం. కానీ, గుజరాత్ వీధుల్లో మాత్రం ఏకంగా ఎనిమిది సింహాలు చక్కర్లు కొట్టాయి.
గాంధీనగర్: సాధారణంగా వీధుల్లో రాత్రిపూట కుక్కలు, పందులు గుంపులు తిరుగుతున్న దృశ్యాలు చూస్తూనే ఉంటాం. కానీ, ఇక్కడ మాత్రం ఏకంగా ఎనిమిది సింహాలు ఒకేసారి వీధుల్లోకి వచ్చాయి. ఇలాంటి అద్భుత దృశ్యమే గుజరాత్ రాష్ట్రంలో ఆవిష్కృతమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గుజరాత్ వీధుల్లో సింహాల గుంపు చక్కర్లు
గుజరాత్ వీధుల్లో 8 సింహాలు తిరుగుతున్న వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) సుశాంత్ నంద తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఎనిమిది సింహాలు గుంపుగా అక్కడి వీధుల్లో తిరుగుతున్నాయి. గిర్ అభయారణ్యానికి ఈ ప్రాంతం సమీపంలోనే ఉండటం గమనార్హం. 'మరో రోజు మరో గర్వం.. గుజరాత్ వీధుల్లో నడవడం' అని ఐఎఫ్‌ఎస్ అధికారి షేర్ చేసిన వీడియోకు క్యాప్షన్‌గా పెట్టారు.

సింహాల గుంపును చూసిన బైకర్ అట్నుంచి అటే..!
గుజరాత్ రాష్ట్రంలోని నివాస ప్రాంతాల్లోనే ఈ సింహాలు తిరుగుతుండటం గమనార్హం. అయితే, రాత్రి సమయంలో కావడంతో ఆ ప్రాంతంలో జన సంచారం లేదు. అయితే, ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చాడు. కానీ, సింహాల గుంపును చూసి ముందుకు వచ్చే సాహసం చేయలేకపోయాడు. అయితే, ఆ సింహాలు కూడా వాహనం చప్పుడు, లైట్ల వెలుగుకు ముందుకు పోకుండా వెనక్కి మళ్లాయి.
సింహాల గుంపు వాకింగ్ వీడియో వైరల్
ఆ సింహాల గుంపు ఎలాంటి ఆదరా బాదరా లేకుండా వీధుల్లో చక్కర్లు కొట్టాయి. ఫిబ్రవరి 15న సదరు అధికారి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. ఇప్పటికే ఈ వీడియోను 278 వేల మందికిపైగా వీక్షించగా.. 4734 వేల మంది లైక్ చేశారు. అంతేగాక, నెటిజన్లు తమదైన శైలిలో వెళుతున్నారు. తాను గిర్ అభయారణాన్యానికి వెళ్లనని.. ఇకపై ఈ వీధులోకి వచ్చి సింహాలను చూస్తానని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.
జనావాసాల్లోకి సింహాల గుంపులు వస్తే..?
గిర్ అభయారణ్యం సింహాలతో నిండిపోయింది కావచ్చు.. అందుకే ఈ సింహాలు వీధుల్లోకి వచ్చి తిరుగుతున్నాయని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ప్రజలు ఉండే ప్రాంతంలో సింహాల గుంపులు తిరగడం భయాందోళనలు కలిగించే అంశమని.. వాటిని వెంటనే అటవీ ప్రాంతంలోకి పంపించాలని మరికొందరు నెటిజన్లు తెలిపారు. వాటికి సొంత ప్రాంతం ఏమి లేదా? అని మరొకరు అన్నారు. సింహాలను చూసిన అక్కడ బైకర్ ఎంత భయపడ్డాడో.. ఇక్కడ తాను కూడా అంతే భయపడ్డానని ఇంకో నెటిజన్ పేర్కొన్నాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications