ఇన్‌స్టాగ్రామ్‌లో 2వేల మంది ఫాలోవర్లు: మేనేజర్ చేసిన పనికి అందరు షాక్..!
మనం పనిచేసేచోట మేనేజర్ లు ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు ఉద్యోగులతో కోపంగా, చీటికిమాటికి చిరాకుపడుతూ తమకు తామే కంపెనీ సీఈఓ, ఫౌండర్ అన్న రేంజ్ లో ఫీల్ అవుతుంటారు. మరికొందరు ఉద్యోగులను అర్థం చేసుకుంటూ, వారి మీద జోకులు వేస్తూ స్నేహపూర్వకంగా వ్యవహరించే బాస్ లేదా మేనేజర్ దొరకడం చాలా అరుదు. అయితే బెంగళూరులో ఒక బాస్ చేసిన చిన్న పని అక్కడి ఉద్యోగులను ఎంతో సంతోషపెట్టింది.అంతేకాదు, ఇలాంటి బాస్ ఉంటే బాగుంటుందని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ఆ బాస్ ఎవరు? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏముంది?
బెంగళూరులోని ఒక కంపెనీ యజమాని ఉద్యోగులకు ఇచ్చిన చిన్న సర్ప్రైజ్ అందరి మనసులను గెలుచుకుంది. ఆ కంపెనీ ఉద్యోగులే కాకుండా, వివిధ కార్పొరేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఈ ఘటనను అభినందిస్తున్నారు. ఒక ఉద్యోగి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 2,000 మంది ఫాలోవర్లు చేరుకున్న సందర్భంగా, బాస్ ఆమెకు కేక్ ఇచ్చి ప్రత్యేకంగా అభినందించారు. ఆ ఉద్యోగిని సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లు, కంపెనీలో ఉన్న సానుకూల వాతావరణం, మంచి వైబ్‌ను ఇది అద్భుతంగా తెలియజేస్తుందని చెప్తున్నారు.

వైరల్ గా మారిన వీడియోలో, ఐశ్వర్య కంపెనీ మీటింగ్ హాల్ లోకి వస్తుండగా తన ఎంట్రీని రికార్డ్ చేస్తున్నవారిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె బాస్, టీమ్ మెంబెర్స్ లోపల కూర్చుని ఉన్నారు. టేబుల్ మీద ఒక కేక్ ఉంచారు. బోర్డు మీద, "2k ఫాలోవర్స్ రీచ్ అయ్యినందుకు సంతోషంగా ఉంది. అభినందనలు ఐషు" అని రాసి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇది చిన్న సెలబ్రేషన్ అయినప్పటికీ, ఇలాంటి సానుకూల వాతావరణం ఉండే కంపెనీలో ఉంటే ఎలాంటి చికాకు ఉండదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాంటి కార్యాలయాల్లో ఉద్యోగులు ఆనందంగా పని చేస్తూ, తమ పనిని మరింత ఆసక్తితో చేయగలుగుతారని వారు వ్యాఖ్యానించారు.
ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు "మీరు నిజంగా అదృష్టవంతులు, మనందరికీ ఇలాంటి బాస్ దొరకరు" అంటూ వ్యాఖ్యానించగా, మరికొందరు "మా కంపెనీ ఈ వీడియో చూస్తే ఇది AIతో చేసిన వీడియో అంటుంది" అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications