కాలేజ్ లవర్స్, ప్రియురాలు హ్యాండ్, మాజీ ప్రియుడి దెబ్బకు ఫోటోలు, ఫోన్ నెంబర్ వైరల్ !
న్యూఢిల్లీ: ఫేమస్ కాలేజ్ లో చదువుకుంటున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కొంతకాలం ఇద్దరూ స్నేహితులుగా ఉన్నారు. రానురాను ఇద్దరూ ప్రేమలోపడ్డారు. ప్రతిరోజు కలుస్తున్న ప్రేమికులు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అయితే ఇటీవల ప్రేమికులు విడిపోయారు. ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని ప్రియుడు అనేక ప్రయత్నాలు చేశాడు. అన్ని దారులు మూసుకుపోవడంతో ప్రియురాలి పర్సనల్ ఫోటోలు, ఆమె ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
తన మాజీ ప్రియురాలిని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఓ యువకుడు ఉన్నాడు. అయితే ప్రియురాలు అప్పటికే మాజీ ప్రియుడి మోహం కూడా చూడకూడదని డిసైడ్ అయ్యింది. నీ మొహం చూడటం నాకు ఇష్టం లేదని మాజీ ప్రియుడికి తేల్చి చెప్పింది. ఇంతలో మాజీ ప్రియుడు మాస్టర్ ప్లాన్ వేశాడు. మాజీ ప్రియురాలి అసభ్యకరమైన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి చేతులు దులుపుకున్నాడు.

సోషల్ మీడియాలో కాలేజ్ అమ్మాయి అశ్లీల ఫోటోలు వైరల్ అయ్యాయి. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగి అవినాష్ కుమార్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని సాకేత్ నగర్ లో అవినాష్ కుమార్ నివాసం ఉంటున్నాడని, ఇతనే అతని మాజీ ప్రియురాలి మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేశాడని పోలీసులు తెలిపారు.
సాకేత్ నగర్ నివాసి 24 ఏళ్ల అవినాష్ కుమార్ ఇప్పుడు పోలీసులకు అతిథి కావడంతో అతనికి కుష్కా తినిపిస్తున్నారు. అవినాష్ కుమార్, అతని మాజీ ప్రియురాలు ఒకే కాలేజీలో చదువుకున్నారు. కాలేజ్ లో చదివే సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లికి ముందే ఇద్దరూ హ్యాపీగా తిరిగేశారు. అయితే వీరి పెళ్లికి ఇరు వైపుల ఇళ్లలో వ్యతిరేకత వచ్చిందని పోలీసులు అన్నారు.
కుటుంబ సభ్యుల వ్యతిరేకతతో ప్రియురాలు ఆమె ప్రియుడు అవినాష్ కుమార్ తో పెళ్లికి నిరాకరించింది. అలా వారి ప్రేమబంధం తెగిపోయింది. అయితే అవినాష్ కుమార్ మాత్రం ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కుటుంబ సభ్యులను ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకుని తాను సంతోషంగా ఉండలేనని, అందుకే విడిపోదామని అవినాష్ కుమార్ కు అతని ప్రియురాలు చెప్పింది.

పెళ్లి చేసుకోవాలని అవినాష్ కుమార్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో కోపోద్రిక్తుడైన అవినాష్ కుమార్ సోషల్ మీడియాలో ఆమె పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమె అసభ్యకరమైన ఫోటో పోస్ట్ చేశాడు. ఆమె మొబైల్ నంబర్‌ను కూడా సోషల్ మీడియాలో పెట్టాడు. కాలేజ్ ప్రియురాలి అసభ్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ దెబ్బతో ఆ యువతికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. షాక్ తిన్న యువతి తనిఖీ చేయగా కొన్ని అసభ్యకరమైన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయని గుర్తించి హడలిపోయింది. ఈ దెబ్బకు అవినాష్ కుమార్ మాజీ ప్రియురాలు భయపడిపోయింది. ఇదే సమయంలో ఫోన్లు చేస్తున్న వ్యక్తులు ఆమెతో అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు.
విసిగిపోయిన యువతి పోలీసుల సాయం కోరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు అవినాష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అవినాష్ కుమార్ పలు విషయాలు వెల్లడించారు. పెళ్లికి యువతి, ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదని, అందుకే ఆమె అసభ్యకరమైన ఫోటోను బయటపెట్టానని, దీంతో ఆమె మరో పెళ్లి చేసుకోలేకపోతుందని, చివరికి. తననే ఆమె పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అందుకే ఇలా చేశానని అవినాష్ కుమార్ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. మాజీ ప్రియురాలి జీవితంతో చెలగాటం ఆడిన అవినాష్ కుమార్ మీద పలు సెక్షల కింద కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications